Aaruguru pathivrathalu Re Release: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రి రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను అలాగే డిజాస్టర్ గా నిలిచిన సినిమాలను 4 కే వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ(EVV satyanarayana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఆరుగురు పతివ్రతలు” (Aaruguru Pathivrathalu)సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోల్డ్ కామెడీ మూవీ 2004 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. అమృత, లహరి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ కౌశిక్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలైన 22 ఏళ్ల తర్వాత 4కె వర్షన్ లో సరికొత్తగా రీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ బోల్డ్ కామెడీ ఎంటర్టైనర్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా పాత పోస్టర్లను, సినిమాలోని ఐకానిక్ సీన్లను షేర్ చేస్తూ రచ్చ మొదలుపెట్టారు. థియేటర్లలో ఈ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ఒక వివాహ వేడుకలో భాగంగా చిన్ననాటి స్నేహితులందరూ ఒకే చోట కలుస్తారు. అయితే పెళ్లి తర్వాత ఈ ఆరుగురు వారి వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనల గురించి, వారి జీవితాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు . ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అప్పట్లో అనుకున్న విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత బుల్లితెరపై ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ లభించింది.
ఇటీవల డిజిటల్ మీడియాలో విడుదలైన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అనే గుర్తింపును దక్కించుకుంది. ఈ విధంగా కల్ట్ క్లాసిక్ సినిమాగా తిరిగి మరోసారి 4 కే వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఏ విధమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. దాదాపు 22 సంవత్సరాలు తర్వాత మరోసారి ఆరుగురు పతివ్రతలు థియేటర్లలో సందడి చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరణ ఎలా ఉంటుంది? ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: రణబాలి నుంచి మూడవ డాక్యుమెంటరీ ‘ది మెన్ వుయ్ ఫర్గాట్’ సిరీస్ రిలీజ్