BigTV English

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీనటులు ఈ మధ్య వరుసగా కాలం చెల్లుతున్నారు. కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోని నలుగురు వరకు చనిపోవడం బాధాకరం. నిన్న టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆ వార్త నుంచి ఇంకా బయటికి రాకముందే ఇప్పుడు మరొకరు మృతి ఒడిలోకి చేరారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటి బి. సరోజా దేవి కన్నుమూశారు. బెంగళూరులో ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, చిత్రాల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి ప్రముఖ హీరోలతో ఈమె నటించారు. ఈమె మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని సమాచారం.


తెలుగు ప్రముఖ నటి కన్నుమూత..

తెలుగు ప్రముఖ నటి బి. సరోజా దేవి ఇవాళ ఆమె నివాసంలోనే కన్నుమూశారు.. ఆమె మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీయర్ హీరోలతో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఈమె కర్ణాటక నటి అయిన కూడా తెలుగులో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 200 లకు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో ఆమె మంచి సినిమాల్లో నటించారు. సరోజాదేవి.. 1938 జనవరి 7, బెంగళూరులో జన్మించారు. సరోజాదేవి తొలి చిత్రం కన్నడ భాషలో ‘మహాకవి కాళిదాస్’.. ఆ చిత్రానికి అవార్డు కు దక్కింది. ఇలాంటి గొప్ప నటి చనిపోవడం బాధాకరం అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.


సరోజినీ దేవి సినిమాలు..

కన్నడ నటి అయినా సరోజినీ దేవి తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాండురంగ సినిమాలో నటించింది. ఆ మూవీనే తెలుగులో మొదటిది. ఈ సినిమాలో కృష్ణ కుమారి ఆమెకు డబ్బింగ్ చెప్పింది. తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పి ‘సీతారామ కళ్యాణం’, ‘ఆత్మబలం’, ‘పెళ్లి కనుక’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కళామ్మతల్లికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెకు 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ఇచ్చింది.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులు అందుకుంది. 2007లో రోటరీ శివాజీ అవార్డు , ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – సౌత్ అవారర్డును సైతం సరోజాదేవి అందుకున్నారు. ఆమె 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా పనిచేసారు.. సినీ ఇండస్ట్రీకి ఈమె చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులను ప్రభుత్వం అందించింది. అలాంటి గొప్ప నటి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈమె మరణ వార్త విన్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. నేడు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె భౌతికయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు..

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×