Rangam Bhavishyavani 2025 : సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. ప్రధాన గట్టమైన రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో పెద్ద మహమ్మారి రాబోతుందని హెచ్చరించారు. అలాగే అగ్నిప్రమాదాలు పెరిగిపోతాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు.
అదే సమయంలో, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు బాగా పండతాయని శుభవార్త కూడా చెప్పారు. ఈసారి భూమి తల్లి కొంగుబంగారంగా పండించేను. రైతులకు సంతోషం, ప్రజలకు ఆహార భద్రత కలుగుతుంది,” అని ఆమె భవిష్యవాణిలో పేర్కొన్నారు.
బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరిని సంతోషంగా, సమానంగా చూస్తాను. మీ అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. మీ అందరినీ సమానంగా చూస్తాను. భక్తులు సమర్పించిన బోనాలు, కానుకలు సంతోషంగా అందుకున్నానని చెప్పిన అమ్మవారు.. ప్రతి ఏడాది తన పూజలకు ఏదో ఒక ఆంటంకం కల్పిస్తున్నారని.. తనని ఎవరూ లెక్కచేయడం లేదని కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాశులకొద్దీ సంపద రప్పించుకుంటున్నా.. తనకు గోరంతైనా దక్కడం లేదని.. సక్రమంగా పూజలు జరిపించాలని ఆదేశించారు. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకొని చనిపోతారని హెచ్చరించారు. కాలం తీరితే.. ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని.. తాను అడ్డు రానని.. స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి వినిపించారు.
ఈ ఉత్సవాల్లో భవిష్యవాణి కేవలం భయం కలిగించే మాటలే కాకుండా.. ప్రజలకు జాగృతిని, భవిష్యంపై అవగాహనను ఇచ్చేలా సాగింది. అగ్నిప్రమాదాల ప్రమాదం పెరుగుతుందని ఆమె ప్రత్యేకించి పేర్కొనడం, భక్తుల్ని అప్రమత్తం చేసింది.
Also Read: ఆషాడం కేజీ సేల్స్.. సౌత్ ఇండియాలో చీరలు కేవలం రూ.49 మాత్రమే
మొత్తానికి, ఈ సంవత్సరం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో.. రంగం భవిష్యవాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు భయాందోళనలు కాదు, భవిష్యంపై స్పష్టత, ధైర్యాన్ని అందించింది. భక్తులందరికి అమ్మవారి అనుగ్రహంతో మంచి జరగాలనే ఆకాంక్షతో.. స్వర్ణలత చేసిన ప్రవచనాలు శుభశకునాలుగా మారాలని ఆశిస్తూ ఈ భక్తిపూర్వక ఘట్టం ముగిసింది.