Shahana Goswami Relationships: సినీ ప్రపంచంలో నటీనటుల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆరాటం ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ నిర్ణయాలతో, విలక్షణమైన పాత్రలతో మెప్పించే తారల లైఫ్ స్టైల్ నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ నటి షహానా గోస్వామి తాజాగా తన రిలేషన్‌షిప్స్, ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
యు హోతా తో క్యా హోతా’ చిత్రంతో
తెలుగు సినీ ప్రేక్షకులకు షహానా గోస్వామి పేరు కాస్త కొత్తగా అనిపించినప్పటికీ, బాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే వారికి ఆమె సుపరిచితమే. 2006లో వచ్చిన ‘యు హోతా తో క్యా హోతా’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన షహానా, ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా 2008లో విడుదలైన ‘రాక్ ఆన్!’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
also read :పవన్ కళ్యాణ్ 500 కోట్ల ‘కోడి చెరువు’ కబ్జా చేశాడా?… పెయిడ్ బ్యాచ్‌కి మైండ్ బ్లాక్ కౌంటర్!
ఆ తర్వాత 2009లో ‘ఫిరాక్’, 2012లో దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన అంతర్జాతీయ చిత్రం ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’, ‘తుమ్హారీ సులు’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఇటీవల కాలంలో ఓటీటీ వేదికలపై కూడా డిజిటల్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆమె, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘బాంబే బేగమ్స్’ లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె నటించిన ‘సంతోష్’ చిత్రం 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడం విశేషం.
తనతో రిలేషన్‌లో ఉండే వారికి ముందే
ఇలా సినిమాల పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 40 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రేమ, శారీరక సంబంధాలపై ఆమె అభిప్రాయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటానని, తన భాగస్వామితో ఎలాంటి రహస్యాలు దాచనని ఆమె స్పష్టం చేశారు.
తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం తనతో రిలేషన్‌లో ఉండే భాగస్వాములకు ముందే పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. సంబంధాలను కొనసాగించే విధానంలో నమ్మకం, ఓపెన్‌నెస్ చాలా ముఖ్యమని, సాంప్రదాయ కట్టుబాట్ల కంటే స్వేచ్ఛకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
ప్యూర్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఆధారంగానే
ప్రేమ అనేది ఎప్పుడూ ఒకరిని నిర్బంధించేలా ఉండకూడదని, భాగస్వామ్యాలు అనేవి సమాజం గీసిన గీతల్లో బలవంతంగా ఇమడకుండా సహజంగా సాగాలని షహానా అభిప్రాయపడ్డారు. తన జీవితంలో ఉన్న సంబంధాలన్నీ కేవలం సాంప్రదాయ ముద్రల కోసం కాకుండా, ప్యూర్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఆధారంగానే నిర్మితమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం తనకు ఎలాంటి భాగస్వామి లేరని ఒంటరిగానే ఉంటున్నానని వెల్లడించిన ఆమె, గతంలో ప్రముఖ మోడల్, నటుడు మిలింద్ సోమన్‌తో నడిపిన లవ్ స్టోరీని కూడా గుర్తుచేసుకున్నారు.
మిలింద్ సోమన్ తో డేటింగ్
తాను టీనేజ్‌లో ఉన్న సమయంలో మిలింద్ సోమన్‌ను స్క్రీన్‌పై చూసి ఇష్టపడ్డానని, ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా అతని కాంటాక్ట్ వివరాలను సేకరించానని తెలిపారు. వీరిద్దరూ నేరుగా డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు కేవలం టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారట. ఆ తర్వాత వీరి బంధం తదుపరి స్థాయికి చేరినప్పటికీ, కొన్ని కారణాల వల్ల 2013లో ఈ క్రేజీ కపుల్ తమ రిలేషన్‌కు ఎండ్ కార్డ్ పలికారు.
also read :9 రోజుల్లోనే రూ.40 కోట్లు.. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న మరాఠీ సినిమా
బ్రేకప్ తర్వాత కూడా ఆమె తన లైఫ్ స్టైల్‌ను, ఆలోచనలను ఎక్కడా మార్చుకోలేదు. ఆధునిక కాలంలో సంబంధాల పట్ల ఉండాల్సిన స్వేచ్ఛను, తన మనసులోని మాటలను ఎలాంటి భేషజాలు లేకుండా పంచుకున్న షహానా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.