E-Paper
Advertisement

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Malayalam Thriller: మలయాళ సినిమాలంటేనే కొత్త కాన్సెప్టులు, ఊహించని మలుపులకు పెట్టింది పేరు. ముఖ్యంగా సాధారణ కథల్లోనే అసాధారణమైన అంశాలను జోడిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు మలయాళం మేకర్స్. ఇప్పుడు అలాంటి ఓ విభిన్నమైన కథతో వచ్చిన మలయాళ చిత్రం ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ (It’s a Medical Miracle) ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లిన ఓ యువకుడు తిరిగి స్పృహలోకి రావడం, ఆ తర్వాత అతడికి వచ్చిన వింత శక్తి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేయడం ఈ సినిమా ప్లాట్. ఇప్పటికే మలయాళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

రూబెన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. దాదాపు రెండేళ్ల పాటు కోమాలోనే ఉంటాడు. అతడి పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకునే స్థితికి వస్తారు. వైద్యులు కూడా ఇక అతడు కోలుకోవడం కష్టమనే అభిప్రాయానికి వస్తారు. కానీ అనూహ్యంగా రూబెన్ స్పృహలోకి వస్తాడు. అందరూ మెడికల్ మిరాకిల్ గా భావించే ఈ పరిణామం తర్వాతే అతడి జీవితంలో అసలైన సమస్య మొదలవుతుంది.

Advertisement

కోమా నుంచి బయటకు వచ్చిన రూబెన్‌ కు ఓ విచిత్రమైన పవర్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న శబ్దాలు కూడా అతడికి చాలా స్పష్టంగా వినిపిస్తుంటాయి. దూరంగా ఉన్నవాళ్లు మాట్లాడుకునే మాటలు సైతం అతడి చెవులకు చేరుతుంటాయి. మొదట ఈ కొత్త శక్తి ఏంటో అర్థంకాక రూబెన్ ఇబ్బంది పడతాడు. సాధారణంగా వినిపించని శబ్దాలు కూడా అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ సామర్థ్యం అతడికి వరమా, శాపమా అన్న సందేహం మొదలవుతుంది.

అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనను కోమా నుంచి బయటకు తీసుకురావడంలో కీలకంగా నిలిచిన ఓ నర్స్ గొంతు అతడికి గుర్తుంటుంది. ఆ గొంతును వెతుక్కుంటూ రూబెన్ ప్రయాణం మొదలుపెడతాడు. కానీ ఈ అన్వేషణ అతడిని ఊహించని పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ముసుగుల వెనుక దాగిన వ్యక్తులు, గతానికి సంబంధించిన రహస్యాలు, ప్రతీకారంతో నిండిన ప్రమాదకరమైన వ్యవహారాల మధ్య చిక్కుకుంటాడు. తనకు వినిపించే ప్రతి మాటలోనూ ఓ క్లూ ఉంటుంది. అదే సమయంలో అది తనను మరో ప్రమాదంలోకి నెట్టే అవకాశం కూడా ఉంటుంది. మరి రూబెన్‌కు వచ్చిన ఈ అసాధారణ వినికిడి శక్తి ఆ రహస్యాలను ఛేదించడానికి ఉపయోగపడుతుందా ? తనను కాపాడిన నర్స్‌ను అతడు కనుగొంటాడా ? ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఎలా బయటపడతాడు ? అనేదే సినిమా కథ.

ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ సినిమా మనోరమ మ్యాక్స్ (Manorama MAX)లో తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రూబెన్ పాత్రలో సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap) నటించగా, షరాఫుద్దీన్ (Sharaf U Dheen), అఖిలా భార్గవన్ (Akhila Bhargavan) కీలక పాత్రల్లో కనిపిస్తారు. కొట్టాయం నజీర్ (Kottayam Nazeer), పార్వతి ఆర్. కృష్ణ (Parvathy R. Krishna), ఆనంద్ మన్మథన్ (Anand Manmadhan), కిరణ్ పీతాంబరన్ (Kiran Peethambaran) తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శ్యామిన్ గిరీష్ (Shyamin Gireesh) దర్శకత్వం వహించారు. డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వొద్దు. అందులోనూ తెలుగులోనే ఉందని గుర్తు పెట్టుకోండి.

Read Also: యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

Related News

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

Big Stories

Advertisement
×