KCR National: మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్! కేటీఆర్ ఇచ్చిన లీడ్ లైన్.. తెలంగాణలో హెడ్ లైన్‌గా మారింది. అసలు ఈ పరిస్థితుల్లో.. కేసీఆర్‌కు నేషనల్ పాలిటిక్స్‌లో స్పేస్ ఉందా? బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదిగే స్కోప్ ఉందా? సారుకు.. కారుకు.. నేషనల్ హైవే క్లియర్‌గా ఉందా?
గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో హైవోల్టేజ్ డిబేట్‌కు దారితీసింది. కేటీఆరే స్వయంగా కేసీఆర్ నేషనల్ రోల్‌పై కామెంట్ చేయడంతో హీట్ డబులైంది. మరి గ్రౌండ్ రియాలిటీలో సౌండ్ సారు వైపే ఉందా? అసలు.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు ఇప్పుడు స్పేస్ ఉందా? లేదా? అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ బీజేపీ దూకుడుని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ గ్రాఫ్ కోల్పోతోందనేది పింక్ పార్టీ వాదన. ఈ స్పేస్‌లోనే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమిని తెరపైకి తెచ్చేందుకు స్కోప్ ఉందని నమ్ముతున్నారు. కేసీఆర్ గతంలోనే టీఆర్ఎస్‌ని.. భారత రాష్ట్ర సమితిగా మార్చి, నేషనల్ అజెండాను అనౌన్స్ చేశారు. బట్.. రిజల్ట్ రివర్స్ అయింది.
తెలంగాణలో అధికారం కోల్పోయాక.. థర్డ్ ఫ్రంట్ పక్కకుపోయి ఉన్న టెంట్ కాపాడుకునేందుకు స్టేట్ పాలిటిక్స్‌పైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడున్న జెన్ జీ జమానాలో.. నేషనల్ లెవెల్‌లో ఇంపాక్ట్ అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ఢిల్లీని శాసించాలంటే మాటలు సరిపోవు. బలంగా నమ్మి నిలబడే మిత్రపక్షాలు, భారీ ఆర్థిక వనరులు కావాలి. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్‌లో.. బీజేపీ, కాంగ్రెస్ నడుమ నలిగిపోకుండా నేషనల్ హైవేలో దూసుకెళ్లాలంటే.. అదంత ఈజీ యవ్వారం కాదు. మరి.. గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? స్టేట్‌ని, నేషనల్ పాలిటిక్స్‌ని బ్యాలెన్స్ చేయగలరా? లేక.. ఈసారి కూడా ఇదొక పొలిటికల్ స్ట్రాటజీగానే మిగిలిపోతుందా?
Also Read: హిందూ దేవుళ్ళపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్!