E-Paper
Advertisement

చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

చెక్ బౌన్స్ కేసు…  బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?
Advertisement

Bandla Ganesh: బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్న బండ్ల గణేష్ (Bandla Ganesh)సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం హాట్ టాపిక్ గా ఉండే బండ్ల గణేష్ కు తాజాగా ఒంగోలు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో భాగంగా ఈయనకు ఏకంగా ఏడాది పాటు కోర్టు జైలు శిక్షణ విధించింది.

ఏడాది జైలు శిక్ష..రూ.95 లక్షల జరిమానా..

ఈ విధంగా ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలను జరిమానా కూడా విధించడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అసలు బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించడం ఏంటి అనే విషయానికి వస్తే.. మద్దిరాల పాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావు(Jetti VenkateswaraRao)కి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ నుంచి 95 లక్షల రూపాయలకి సంబంధించిన చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ (Cheque Bounce)కావడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.

95 లక్షల జరిమానా..

Advertisement

ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు అయిన నేపథ్యంలో ఒంగోలు కోర్టు బండ్ల గణేష్ కు ఏకంగా ఏడాది పాటు జైలు శిక్ష అలాగే 95 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్ష మాత్రమే కాకుండా జరిమాన మొత్తంతో పాటు కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేష్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టుకు వెళ్లడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా పలు చెక్ బౌన్స్ కేసుల్లో ఈయనకు కోర్టు జైలు శిక్ష విధించగా ఆయన ఆపిల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

బండ్ల గణేష్ స్పందన ఏంటి..

తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో బండ్ల గణేష్ స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇలా బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించారనే విషయం తెలియడంతో ఇది కాస్త టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చలకు కారణమైంది. మరి ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా బండ్ల గణేష్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఆయన స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే ఈయన నిర్మాతగా కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల బండ్ల గణేష్ మరొక కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. త్వరలోనే నాగచైతన్యతో బండ్ల గణేష్ సినిమా ప్రకటన ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటన వెలువడ లేదు.

Advertisement

Also Read: ఆ భయంతోనే ప్రియాంక జైన్ సీరియల్స్ కి దూరమయ్యారా?

Related News

రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!

ఈ రోజే బిడ్డకు జన్మనివ్వచ్చేమో..సమంత పోస్ట్ వైరల్!

రాజ్ ఫ్యామిలీతో సమంత స్పెషల్ సీమంతం వేడుక..ఫొటోస్ వైరల్ !

ఆసక్తికరంగా మోసపోయాం జానకి.. సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ప్రమోషన్!

తరుణ్ కి ఈషా సరైన జోడీ.. పెళ్లి పై తల్లి క్లారిటీ!

‘కాకా ‘ ఓకే.. ‘విశ్వంభరా’ పరిస్థితి ఏంటి..?

Big Stories

Advertisement
×