Anushka Shetty: అందం, అభినయంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనుష్క.. ఈమధ్య ఎక్కడ? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి ఐకానిక్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈమె.. తెలుగుతో పాటు తమిళ్లో కూడా నటించింది. 2018లో భాగమతి సినిమా తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమా చేస్తూ వస్తోంది. ముఖ్యంగా 2018 నుండి 2026 మధ్యకాలంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది..
అంతేకాదు గతంలో లాగా వరుసగా సినిమాలు చేయట్లేదు పైగా తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి రావట్లేదు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో అనుష్కని బయట జనాల్లో మీడియా ముందు చూసి దాదాపు 8 ఏళ్లవుతోంది అని అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో అనుష్క నుంచి మరో బ్యాడ్ న్యూస్ అభిమానులకు వినిపించడం గమనార్హం ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుష్క మొత్తానికి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుంది అని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఉన్న తన సొంత ఇంటిని కూడా అనుష్క అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు తెలుగు, తమిళ్ భాషలలో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆమె ఒక ఇంటిని కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరం అవ్వడం.. హైదరాబాద్ కి రాకపోకలు తగ్గిపోవడం.. సొంత ఊర్లోనే ఉండడంతో.. ఆ ఇంటిని రెంటుకు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని కూడా అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా సినిమాలు మానేస్తున్నందుకే హైదరాబాద్ కి వచ్చే అవసరం లేదు కాబట్టే అనుష్క ఆ ఇంటిని అమ్మేసిందని టాలీవుడ్ వర్గాలు నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అనుష్కకి సంబంధించి వైరల్ అవుతున్న ఈ వార్త మాత్రం అభిమానులను పూర్తి నిరాశకు గురిచేస్తుంది.
also read: రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!
అనుష్క విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. తెలుగులో యూవీ క్రియేషన్స్ లో కూడా ఒక సినిమా ఉంటుందని చెప్పారు. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక అనుష్క సినిమాలు చేయదు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమాలు చెయ్యదు ఓకే మరి పెళ్లి సంగతేంటి ? అని కూడా ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బిజినెస్ మాన్ తో వివాహమని, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో వివాహమని ఇలా పలు రకాల రూమర్లు వినిపించినా.. అది కూడా నిజం కాలేదు. ఇలాంటి రూమర్లతోనే అనుష్క వైరల్ అవుతోంది. కానీ ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందో తెలియని పరిస్థితి అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తోంది. కనీసం ఇప్పటికైనా అనుష్క స్పందించి అభిమానులకు ఊరట కలిగించే అంశం ఏదైనా చెబుతుందేమో చూడాలి.