E-Paper
Advertisement

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!
Advertisement

School Controversy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఓ వింత ఘటన అందరిని కలిచివేసింది. గ్రామానికి చెందిన ముత్యాల రాజు తన ఇద్దరి పిల్లలను ఉదయం పాఠశాలకు పంపాడు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మీరు స్నానం చేయలేదు మీరు స్కూల్‌కు రావద్దు అంటూ బడినుండీ బయటకు పంపించాడు. విద్యార్థులు అమ్మాయి 2 వ తరగతి అబ్బాయి 1 వ తరగతి చదువుతున్నారు. స్నానం చేయలేదని అందరి విద్యార్థుల ముందు అవహేళనగా ఉపాధ్యాయుడు మాట్లాడడంతో ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఇంటికి పరిగెత్తారు.

ఉపాధ్యాయుల ప్రవర్తన..

పిల్లలకు జ్వరం వచ్చింది అందుకే స్నానం చేయలేదు అంటూ తండ్రి చెప్పిన వినిపించుకోలేదు స్కూల్ ఉపాధ్యాయుడూ సాయిలు. ఇక చేసేది ఏమి లేక తండ్రి రాజు తన పిల్లలను బుదేరా లోని ప్రయివేట్ స్కూల్ కు పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలి అంటే ఇక్కడమాత్రం ఉపాధ్యాయుల ప్రవర్తన వల్ల ప్రయివేట్ స్కూల్‌ను తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారు. మండల విద్యాధికారికి ఫోన్లో సంప్రదించగా సరైన సమాచారం ఇవ్వకుండా మాటలు దాటేశాడంటూ బాదితుడు పేర్కోన్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్.

Advertisement

గతంలో కూడా ఈ మండలంలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూలుకు వచ్చి సంతకాలు పెట్టి బయటకు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ షోకాస్ నోటిఫికేషన్ కూడా జారీచేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో మండల విద్యాధికారి పరిరక్షణ లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also read: ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

Tags

Related News

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్.. కీలక ఉత్తర్వులు జారీ!

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ఆదిలాబాద్ రిమ్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు!

నిర్మల్‌లో షాకింగ్ ఘటన.. నాలుగు అంతస్తులపై నుంచి దూకిన మహిళ!

ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్

ఆ సారు కోపం ఇంకా చల్లారలేదా.. ఆసుపత్రుల్లో ప్రమోషన్ల ఫైళ్లకు బ్రేక్‌లు!

ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×