BigTV English

Shankar : పాపం శంకర్ పరిస్థితి మరే దర్శకుడికి రావొద్దు… భారీ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చినా అవే ట్రోల్స్

Shankar : పాపం శంకర్ పరిస్థితి మరే దర్శకుడికి రావొద్దు… భారీ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చినా అవే ట్రోల్స్

Shankar : డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం తన పరిస్థితి బాలేదు గాని ఒకప్పుడు శంకర్ సినిమాలంటేనే ఒక రేంజ్ లో ఉండేవి. ఇప్పుడంతా పాన్ ఇండియా అని అంటున్నారు. కానీ ఒకప్పుడు శంకర్ ఎంచుకునే కాన్సెప్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. శంకర్ కెరియర్ లో జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడు వంటి ఎన్నో సినిమాలు కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాకుండా మంచి మెసేజ్లు కూడా ఇచ్చేవి.


 

అయితే భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని మినిమం ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ కు అదో చేదు అనుభవం అని కూడా చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత చరణ్ చేసిన సినిమా అది.


భారీ అప్డేట్ కి ట్రోల్స్ 

శంకర్ రీసెంట్ గా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వేల్పారి అనే ఒక పుస్తకం గురించి చెప్పారు. ఒకప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తనకి సినిమా చూసిన అభిప్రాయం కలిగేదట. అయితే ఆ పుస్తకాన్ని సినిమాగా తీయాలి అని శంకర్ భావించారు. ఒకప్పుడు నేను రోబో అనే సినిమా చేయాలి అని కలకన్నాను. ఆకల నెరవేరి పోయింది. ఇప్పుడు నేను “వేల్పారి” అనే సినిమాను చేయాలని కలకంటున్నాను అంటూ తెలిపారు శంకర్. ఇక్కడితో శంకర్ పైన విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. అప్డేట్ ఇవ్వగానే ఆల్రెడీ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి కాబట్టి రిటైర్మెంట్ తీసుకోమంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అవతార్ రేంజ్ లో ఉండబోతుంది 

వేల్పారి సినిమా చేయడానికి మంచి స్కోప్ కూడా ఉంది. గేమ్ ఆఫ్ త్రోన్స్, అవతార్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిపారు శంకర్. ఈ సినిమాకి సరికొత్త టెక్నాలజీని కూడా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. సంగీత పరంగా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు శంకర్ తెలిపారు. అయితే ఈ మాటలను కూడా పరిగణలోకి తీసుకొని గతంలో శంకర్ ఎలా చెప్పినప్పుడు ఆ సినిమాలో డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే అవ్వబోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలానే ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఇంకా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చిన శంకర్ నేడు ఇటువంటి పరిస్థితిని చూడటం అనేది ఎవరు ఊహించలేనిది.

Also Read: AA22xA6 : నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్, ఇదెక్కడి ట్విస్ట్ భాయ్.?

Related News

Little Hearts Collection : ‘లిటిల్ హార్ట్స్‌’కి బిగ్ రెస్పాన్స్.. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్..

Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు

Ghaati Collection : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్… పాపం అనుష్కకు ఐదు కోట్లు కూడా రాలేదు

Kamal Haasan: రూమర్స్ కి ఆజ్యం పోసిన కమలహాసన్.. రజనీకాంత్ తో అది నిజమే అంటూ!

Kayadu Lohar: వెకేషన్స్ లో సందడి చేస్తున్న కాయాదు లోహర్.. ఫోటోస్ వైరల్

SP Charan : నన్ను వేధిస్తున్నాడు… అసిస్టెంట్ డైరెక్టర్‌పై ఎస్పీ చరణ్ ఫిర్యాదు

Big Stories

×