AA22xA6 : అల్లు అర్జున్ ఒకప్పుడు తెలుగు మాత్రమే పరిమితమైన ఏ పేరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అల్లు అర్జున్ మీద ఉన్న కోపం కూడా ఆ సినిమా చూసినప్పుడు చచ్చిపోతుంది అని చెప్పాలి.
సినిమాని ట్రోల్ చేయడానికి వెళ్ళిన చాలామంది సినిమా చూసి ఫిదా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఫ్లైన్లో అల్లు అర్జున్ యాటిట్యూడ్ విషయాన్ని పక్కన పెడితే, సినిమాల్లో మాత్రం అల్లు అర్జున్ నటించిన తీరు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ను వెతుక్కుంటూ వద్దకు వచ్చింది.
నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఆరువ సినిమా ఇది. అట్లీ కెరియర్ లో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఒకసారి హీరోగా చేసిన జవాన్ సినిమా ఏ స్థాయి హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 1000 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో కూడా అట్లీ అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అలానే ఇద్దరు కుమారులు పాత్రలను కూడా అల్లు అర్జున్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అట్లీ పెద్దగానే ప్లాన్ చేశాడు
ఇక అట్లీ విషయానికొస్తే ఒక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి ఉండాలో వాటిని అద్భుతంగా పొందుపరుస్తాడు. ఇదివరకే చాలా సినిమాల్లో అట్లీ హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారు. ఇక మొదటిసారి అల్లు అర్జున్ 4 పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలిసిన వెంటనే చాలామందికి క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోయింది. అంతలా అట్లీ ఏం ప్లాన్ చేసి ఉంటాడు అని చాలామంది ఇప్పటినుంచి అంచనా వేయడం మొదలుపెట్టారు. సినిమా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్ల వరకు ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
Also Read : SSMB 29 : హీరోని పట్టించుకోని జక్కన్న, అలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి.?