WaQar Azam On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match, Group B) మధ్య దోహా వేదికగా (West End Park International Cricket Stadium, Doha) ఆదివారం మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ అభిమాని వకార్ అజమ్ సంచలన ప్రకటన చేశాడు. టీమిండియాపై బౌండరీలు, సిక్సులు బాదితే డబ్బులు ఇస్తానని తెలిపాడు. ఒక్క బౌండరీ, సిక్సర్ కు 100 పాకిస్తానీ రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.
అంటే ఒక్కో బౌండరీ, సిక్సరుకు ఇండియన్ రూపాయలలో 33 రూపాయలన్నమాట. మన దగ్గర ఆ డబ్బులు తక్కువ అయినప్పటికీ.. పాకిస్తాన్ లో ఎక్కువే. అయితే మ్యాచ్ కంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పాకిస్తాన్ క్రికెటర్లకు చెక్కులు పంపిస్తున్నట్టు వెల్లడించాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా 23 బౌండరీలు, 13 సిక్సర్లు పాకిస్తాన్ ప్లేయర్లు బాదారని పేర్కొన్నాడు. ఈ లెక్కన 46 చెక్కులు పాకిస్తాన్ ప్లేయర్లకు పంపిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశాడు.
పాకిస్తాన్ అభిమాని వకార్ ఆజమ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇండియా పై విమర్శలు చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఓ చాలెంజ్ విసిరాడు. ఆ టోర్నమెంట్ లో టీమిండియా ఓడిపోతుందని.. సిరీస్ న్యూజిలాండ్ గెలుస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా కాకుండా న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సిరీస్ గెలిస్తే గుండు గీయించుకుంటానని చాలెంజ్ చేశాడు.
ఈ క్రమంలో టీమిండియా 31 తేడాతో కివీస్ గడ్డపై వన్డే సిరీస్ దక్కించుకుంది. ముందుగా ఛాలెంజ్ చేసిన ప్రకారం గుండు గీయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు వకార్ ఆజమ్. ఇక లేటెస్ట్ గా బౌండరీలు, సిక్సర్లపై చ ప్రకటన చేసి చెక్కులు పంపిణీ చేశారు. ఇది ఇలా ఉండగా, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) గ్రూప్ స్టేజ్ లో టీమిండియా, పాకిస్తాన్ ( Tea India VS Pak ) మధ్య జరిగింది. ఇందులో 48 పరుగులతో తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.