Historical Mystery Thriller on OTT: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలకు ఓటీటీలలో క్రేజ్ ఇప్పడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిని ప్రేక్షకులు కళ్లార్పకుండా, చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అంతేకాదు భాషను కూడా పాట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఈ కాలంలో కాదు, 16వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంలో ఒక మూసివేసిన కోటలో జరిగే వరుస హత్యల మిస్టరీ చుట్టూ తరుగుతుంది. కంటెంట్ చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా, ప్రతి సీన్‌లోనూ ఊహించని మలుపులతో సాగే ఈ జపనీస్ హిస్టారికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది సమురాయ్ అండ్ ది ప్రిజనర్’ (The Samurai and the Prisoner) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ జపనీస్ దర్శకుడు కియోషి కురోసావా (Kiyoshi Kurosawa) తెరకెక్కించిన ఈ చిత్రంలో దిగ్గజ నటుడు మసాహిరో మోటోకి (Masahiro Motoki), యూత్ స్టార్ మసాకి సుడా (Masaki Suda), యురికో యోషితకా (Yuriko Yoshitaka) ప్రధాన పాత్రలు పోషించారు. హొనోబు యోనెజావా రాసిన అవార్డు విన్నింగ్ నవల ఆధారంగా రూపొంది, కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఆ కోటలో జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యం ఏంటో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సినిమా కథంతా 1578వ సంవత్సరంలో జపాన్‌లోని ‘సెంగోకు’ యుద్ధ కాలం నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథలో అరియోకా కోటకు అధిపతి అయిన సమురాయ్ అరాకి మురషిగే, తనకంటే ఎంతో శక్తివంతమైన సైన్యాధిపతి ఓడా నోబునాగాపై తిరుగుబాటు ప్రకటిస్తాడు. దీంతో ఆగ్రహించిన నోబునాగా తన భారీ సైన్యంతో అరియోకా కోటను చుట్టుముడతాడు. బయట శత్రు సైన్యం దాడికి సిద్ధంగా ఉంటే, కోట లోపల మాత్రం ఊహించని రీతిలో వరుస హత్యలు, ద్రోహాలు మొదలవుతాయి. ప్రతీ సన్నివేశం రోమాలు నిక్కబొడిచేలా సాగుతుంది.
శత్రువులను ఎదుర్కోవాలా లేక కోట లోపల ఉన్న ద్రోహులను పట్టుకోవాలా తెలియక మురషిగే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతాడు. తన సైనికుల్లోనే ఎవరో నమ్మకద్రోహం చేస్తున్నారని గ్రహించిన అతను, దిక్కుతోచని స్థితిలో ఒక వింత నిర్ణయం తీసుకుంటాడు. తన చెరసాలలో బందీగా ఉన్న శత్రు పక్షపు మేధావి, వ్యూహకర్త అయిన కన్బే కురోడా సహాయం కోరతాడు. చెరసాల ఉండి కూడా కురోడా తన పదునైన ఆలోచనలతో కోటలో జరుగుతున్న మిస్టరీలను ఒక్కొక్కటిగా విప్పుతుంటాడు. తన భార్య చియోహో అండతో, బందీగా ఉన్న కురోడా సలహాలతో మురషిగే ఆ రహస్య హంతకుడిని ఎలా కనిపెట్టాడు ? చివరకు ఈ ముట్టడి అతని జీవితాన్ని ఎలా మార్చిందనేది ఊపిరి బిగబట్టి చూసేలా తెరకెక్కించారు.
IMDbలో 7.1/10 రేటింగ్, రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 97 శాతం రేటింగ్ సాధించిన ‘ది సమురాయ్ అండ్ ది ప్రిజనర్’ (The Samurai and the Prisoner) థ్రిల్లింగ్ మిస్టరీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి వచ్చింది. 2026 నవంబర్ 24 నుంచి ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంటల్ Rent విధానంలో అందుబాటులో ఉంది. ఒరిజినల్ జపనీస్ (Japanese) ఆడియోతో పాటు ఇంగ్లీష్ (English) సబ్‌టైటిల్స్ సదుపాయంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, మైండ్-గేమ్ థ్రిల్లర్లు, క్లాసిక్ డిటెక్టివ్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్.
Read Also: ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్