Suriya Scene Movie:థియేటర్లలో సందడి చేసిన ఎన్నో చిత్రాలు ఇప్పుడు ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సీన్’ చిత్రం. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ హిట్ గా నిలిచింది.
కోలీవుడ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలై.. భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. పైగా ఈ చిత్రంతో సూర్య హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రాన్ని సూర్య తన భార్య జ్యోతికతో కలిసి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ప్రేమలు సినిమాతో హీరోగా అందరిని ఆకట్టుకున్న నస్లైన్ ఇందులో విలన్ గా నటించి సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచారు. అలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అలరించడానికి సిద్ధమయింది.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల ఒప్పందం నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 4న ఓటీటిలో విడుదల కాబోతున్నట్లు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 4న తమిళ్, హిందీ ,తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా నజ్రియా నజీమ్ నటించగా.. లాల్ ఆనంద్ రాజు కీలక పాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.
also read:లోపల త్రిగుణ్..బయట పీఆర్ టీం.. బిగ్ బాస్ వారి చేతుల్లోనే: నటరాజ్ మాస్టర్
చాలా రోజుల తర్వాత సూర్య ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ప్రేమ్ రాజ్ (సూర్య) అనే పాత్రలో క్రైమ్ బ్రాంచ్ లో డీఎస్పీగా పనిచేస్తూ ఉంటాడు. దృష్టిలోపం ఉన్నా.. డిపార్ట్‌మెంటులోకి వచ్చిన ఐదేళ్లలోనే తన తెలివితేటలతో ఎన్నో కేసులను ఛేదించి మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. పోస్టు మార్టం రిపోర్ట్స్ లో ప్రేమ్ గతంలో టేకప్ చేసిన సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్) కేసుతో పోలికలు ఉన్నట్లు గుర్తిస్తారు. దీంతో విక్టర్ జైలులో ఉండడంతో ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనేది మిస్టరీగా మారుతుంది. ఇక ఈ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగుతాడు ప్రేమ్. అతని గురించి ఒక నిజం పోలీసులకు తెలుస్తుంది. దీంతో ప్రేమ్ ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ప్రేమ్.. మాయ (నజ్రియా) సహాయంతో పోలీసులకు తెలియకుండా తనదైన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే తను ఈశ్వరన్(నస్లెన్) అనే మరో సీరియల్ కిల్లర్ ను ఫేస్ చేస్తాడు. మరి ఈ సీరియల్ కిల్లర్ ను ఫ్రేమ్ పట్టుకున్నాడా? ఇన్వెస్టిగేషణ్ లో ఎదురైన సవాల్ ఏంటి ? అనేది సినిమా కథ.