E-Paper
Advertisement

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

Poultry India Expo 2026: ఎల్‌నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నం బియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కానీ పౌల్ట్రీ రంగానికి సంబంధించి మొక్క జొన్నల కొరత ఉందని మా దృష్టికి వచ్చిందన్నారు. ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలని మా మంత్రులను ఆదేశిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026  ప్రారంభం

వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉపాధి కలిగించే పరిశ్రమ పౌల్ట్రీ రంగమని అన్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే కోళ్లు, గుడ్లను ఉత్పత్తి చేయడమే కాదు.. రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తుందన్నారు.  బుధవారం హైదరాబాద్ HICCలో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఎక్స్ పో ఏర్పాటు చేయడం అభినంద నీయమన్నారు.

Advertisement

5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులకు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పాల్ట్రీ వ్యాపారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారని వివరించారు.  సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలని ప్రతిపాదనలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల్లో పౌల్ట్రీ నిర్మించు కోవడానికి సింగిల్ విండో విధానం అనుమతులు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమలో నిలబడటం, పరిశ్రమను కాపాడటాన్ని ప్రభుత్వం అభినందిస్తోందన్నారు. పౌల్ట్రీని కూడా ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పాలసీలను రూపొందిస్తామన్నారు. కాలానుగుణంగా క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఇంప్రూవ్ చేసుకుంటా మన్నారు. పాలసీలు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో మీకు ఎలాంటి చింత అవసరం లేదన్నారు.

Advertisement

ALSO READ: నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.. బీఆర్ఎస్ కేవలం అందుకే, రాజగోపాల్ ఆరోపణలు నిజమేనన్న కవిత

తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి పాలసీలను కొనసాగిస్తూనే, కొత్త పాలసీలను తీసుకొస్తున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణకు 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అవసరమైన భూకేటాయింపులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

Related News

నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.. బీఆర్ఎస్ కేవలం అందుకే, రాజగోపాల్ ఆరోపణలు నిజమేనన్న కవిత

హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆఫీసులకు వెళ్లేవారు..

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు చెక్.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలపై క్లారిటీ?

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!

ఆ లెక్కలు అన్ని బైటపెట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్?

హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!

నేను కావాలని ఆ పదం అనలేదు.. మాట దొర్లాను: మంత్రి సీతక్క!

Big Stories

Advertisement
×