E-Paper
Advertisement

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా
Advertisement

Family Legal Drama on OTT: పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రేమతో మందలించడం, భవిష్యత్తు బాగుండాలని అప్పుడప్పుడు కాస్త కఠినంగా ఉండటం ప్రతి తల్లిదండ్రులు చేసే పనే. అయితే కొన్ని దేశాలు వీటిని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాయి. అలా మందలించినందుకు ఒక దేశంలో అది ఒక పెద్ద నేరంగా మారి, కన్నతల్లి కడుపుకోతకు కారణమైంది. కంటికి రెప్పలా కాపాడుకున్న ఐదుగురు బిడ్డలను ఆ దేశ ప్రభుత్వమే బలవంతంగా తల్లికి దూరం చేస్తే ఆ మాతృహృదయం పడే నరకయాతన ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. నార్వేలో సంచలనం సృష్టించిన ‘బొడ్నారియు’ (Bodnariu) కుటుంబం కేసు ఆధారంగా, హృదయాన్ని పిండేసేలా తెరకెక్కిన అద్భుతమైన లీగల్ ఫ్యామిలీ డ్రామా ‘ఫ్జోర్డ్’ (Fjord) ఇప్పుడు డిజిటల్ తెరపై ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ప్రతిష్ఠాత్మక 2026 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యుత్తమ పురస్కారం ‘పామ్ డి ఓర్’ (Palme d’Or) గెలుచుకున్న ఈ చిత్రంలో మార్వెల్ ‘వింటర్ సోల్జర్’ ఫేమ్ సెబాస్టియన్ స్టాన్ (Sebastian Stan), ఆస్కార్ నామినీ రెనేట్ రీన్స్వ్ (Renate Reinsve) ప్రధాన పాత్రల్లో జీవించేశారు. రొమేనియన్ దిగ్గజ దర్శకుడు క్రిస్టియన్ ముంగియు (Cristian Mungiu) తీర్చిదిద్దిన ఈ మూవీని చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగవు.

‘ఫ్జోర్డ్’ (Fjord) కథలోకి వెళ్తే..

ఈ సినిమా కథంతా మిహై (సెబాస్టియన్ స్టాన్), లిస్బెట్ ఘోర్గియు (రెనేట్ రీన్స్వ్) అనే ఒక క్రైస్తవ దంపతుల చుట్టూ సాగుతుంది. రొమేనియాలో ఉన్న ఈ జంట, తమ ఐదుగురు పిల్లలతో కలిసి మంచి భవిష్యత్తు కోసం లిస్బెట్ సొంతూరైన నార్వేలోని ఒక మారుమూల తీర ప్రాంత పట్టణానికి మకాం మారుస్తారు. అక్కడి పొరుగువారితో ఎంతో మంచిగా ఉంటూ, ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక చిన్న సంఘటన పెను తుఫాను సృష్టిస్తుంది. ఒకరోజు వీరి పెద్ద కూతురు ఎలియా ఒంటిపై చిన్న గాయాలు (బ్రూయిజెస్) కనిపించడంతో స్కూల్ సిబ్బందికి అనుమానం వస్తుంది.

Advertisement

పిల్లలను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో తాము మందలించామని, చిన్నపాటి దెబ్బ వేశామని తండ్రి నిజాయితీగా అంగీకరించడంతో అక్కడి ప్రభుత్వ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు (బార్నెవెర్నెట్) రంగంలోకి దిగుతారు. కనీసం తల్లిదండ్రుల వాదన కూడా వినకుండా, చంటిబిడ్డతో సహా ఐదుగురు పిల్లలను తల్లికి దూరం చేసి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. చట్టపరమైన నిబంధనల మధ్య నలిగిపోయిన ఆ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను తిరిగి దక్కించుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థపై చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటమే ఈ సినిమా.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

ఐయండిబి 7.6/10 రేటింగ్, రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 91 శాతం పాజిటివ్ స్కోర్ సాధించిన ‘ఫ్జోర్డ్’ (Fjord) లీగల్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ రోజు నుంచి ప్రైమ్ వీడియోలో రెంటల్ (Rent) విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ (English) ఆడియోతో పాటు నార్వేజియన్, రొమేనియన్ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మనసును కదిలించే రియల్ స్టోరీలు, ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Advertisement

Read Also: ప్లేట్లు కడిగే కుర్రాడు… కట్ చేస్తే ప్రపంచాన్నే ఏలిన చెఫ్… ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ బయోపిక్

Related News

జూనియర్‌తో పరిచయం… సీనియర్‌తో ఆ పని… క్రేజీ కొరియన్ ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన వస్తువు… చరిత్రనే మార్చే రహస్యం… ట్విస్టులతో మతిపోగొట్టే కామెడీ మిస్టరీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘ఇది నా అడ్డా’ అంటూ చిరంజీవి రచ్చ!

36 ఏళ్ల క్రితం చనిపోయిన శవం… ప్రతి పౌర్ణమికి రాక్షసుడిగా… ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్

ఓటీటీలోకి నయనతార మహాశక్తి.. అక్కడే స్ట్రీమింగ్!

ఘటోత్కచుడి జననం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మహాభారత ఘట్టాలు

మెగా వర్స్ నుంచి క్రేజీ ప్రోమో రిలీజ్.. సస్పెన్స్ కు తెరదించిన నెట్ ఫ్లిక్స్!

Big Stories

Advertisement
×