E-Paper
Advertisement

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!
Advertisement

Teacher Arrested: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన స్కూల్ టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సదరు ఉపాధ్యాయుడు తనకు వాట్సప్ లో అభ్యంతరకర సందేశాలు పంపాడని 12వ తరగతి విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. నిందితుడు నరేంద్ర కుష్వాహా.. ‘బయటకు వస్తావా?’ అంటూ విద్యార్థినికి పంపిన వాట్సప్ మెసేజ్ లు ఈ కేసులో కీలక ఆధారంగా మారాయి.

జిల్లా కలెక్టర్, ఉన్నత పోలీసు అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదులో విద్యార్థిని పలు కీలక విషయాలు పేర్కొంది. ఉపాధ్యాయుడు నరేంద్ర కుష్వాహా తనకు ‘సాయంత్రం 5 గంటలకు ఖాళీగా ఉన్నావా? బయటకు వెళ్దాం. 8 గంటలకల్లా ఫ్రీ అయిపోతావు’ అంటూ సందేశాలు పంపినట్లు విద్యార్థిని ఆరోపించింది. బాలల దినోత్సవం (నవంబర్ 14) రోజున సదరు టీచర్ తనతో మాటలు కలిపాడని విద్యార్థిని తెలిపింది.

Advertisement

ఆ తర్వాత నవంబర్ 18 నుంచి 20వ తేదీ మధ్య వరుసగా అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపాడం ప్రారంభించాడని ఫిర్యాదులో ఆరోపించింది. ‘నేను చెప్పిన బట్టలు వేసుకో’ అని కూడా అతను తనను కోరాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ‘ఆప్కీ బాత్ అలగ్ హై (నువ్వు వేరు)’ అంటూ పంపిన మెసేజ్‌లతో పాటు.. ‘నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని కూడా రాశాడని తెలిపింది. తనను నిద్రపుచ్చాలని అడగడమే కాకుండా ‘నీకు ఏమైనా సహాయం చేయాలా చెప్పు’ అని కూడా అడిగాడని ఆరోపించింది.

Also Read: ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!

Advertisement

పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌లో అతనికి ఒక సీక్రెట్ రూమ్ ఉందని కూడా విద్యార్థిని ఆరోపించింది. మాట్లాడాలని పిలిచి పలువురు విద్యార్థులను అక్కడికి తీసుకెళ్లేవాడని పేర్కొంది. ఒకవేళ తనతో మాట్లాడకపోయిన, చెప్పిన మాట వినకపోయినా మార్కులు తగ్గిస్తానని బెదిరించాడని పేర్కొంది. కాగా, సదరు బాధిత విద్యార్థినితో పాటు మరికొందరితోనూ ఉపాధ్యాయుడు ఇలాగే అభ్యంతకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం టీచర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన వస్తువు… చరిత్రనే మార్చే రహస్యం… ట్విస్టులతో మతిపోగొట్టే కామెడీ మిస్టరీ సిరీస్

Tags

Related News

ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!

అన్ని బంధాలు తెంచుకున్నాం.. బతికి ఉండగానే కూతురికి అంత్యక్రియలు, మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన

OYO గదిలో డిగ్రీ యువతి మృతి.. పత్తాలేని ప్రియుడు, హర్యానాలో షాకింగ్ ఘటన

ఆత్మాహుతి దాడికి భారీ కుట్ర.. మీరట్‌లో ఉగ్రవాది అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

రూ.కోటి బీమా పాలసీ.. గుండెపోటుతో వ్యక్తి మరణం.. చెల్లింపు నిరాకరించిన కంపెనీ.. కోర్టు తీర్పు ఇదే

రహస్యాల లీక్ ఎఫెక్ట్.. సైనికులకు 87 యాప్‌లు బ్యాన్.. ఇన్‌స్టా, ఎక్స్‌ పోస్టులపై నిషేధం!

బీజేపీ vs టీవీకే.. తిరుపరన్‌కుండ్రంలో హైటెన్షన్.. 10 వేల మంది పోలీసుల మోహరింపు!

Big Stories

Advertisement
×