E-Paper

శర్వానంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ క్రిష్’గా సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్!

శర్వానంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ క్రిష్’గా సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్!
Advertisement

George Krish Movie: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే శర్వానంద్.. ఈసారి పక్కా కమర్షియల్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్‌ను క్రియేట్ చేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన ఒక భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Read also-స్క్రీన్‌పై భయపెట్టిన ‘సమారా’ ఇక లేదు.. 35 ఏళ్లకే ‘ది రింగ్’ నటి డేవేగ్ చేజ్ హఠాన్మరణం!

Advertisement

శ్రీను వైట్ల మార్క్

ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. శ్రీను వైట్ల మార్క్ హిలేరియస్ కామెడీ, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ సాగనుంది. ఇందులో శర్వానంద్ సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం.

Advertisement

కథానాయికగా ప్రీతి ముకుందన్

ఈ సినిమాలో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించినప్పటికీ.. చిత్ర బృందం క్రేజీ బ్యూటీ ప్రీతి ముకుందన్ వైపు మొగ్గు చూపింది. వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రీతి ముకుందన్.. ఈ సినిమాలో శర్వానంద్‌తో జతకట్టడం ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Read also-మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

రంగంలోకి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను మొదట ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణ బాధ్యతల్లో మార్పు జరిగింది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

2027 సంక్రాంతికి విడుదల!

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ చాలా బాగా కలిసిసొచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో సంక్రాంతి విజేతగా నిలిచిన ఆయన.. ఈ ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని కూడా పొంగల్ 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’ షూటింగ్ ముగిసిన వెంటనే ఈ శ్రీను వైట్ల ప్రాజెక్ట్ వేగంగా పట్టాలెక్కనుంది. ఒకవైపు శర్వానంద్ జోరు, మరోవైపు శ్రీను వైట్ల కమ్‌బ్యాక్ మార్క్ కామెడీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి.

Related News

సీఎం విజయ్‌పై నటి సమంత ప్రశంసల.. బాబోయ్ మరీ ఇంతనా..

స్క్రీన్‌పై భయపెట్టిన ‘సమారా’ ఇక లేదు.. 35 ఏళ్లకే ‘ది రింగ్’ నటి డేవేగ్ చేజ్ హఠాన్మరణం!

రణవీర్ సింగ్ ‘ధురంధర్’ స్క్రిప్ట్ PMO నుంచే వచ్చిందా?.. రాకేశ్ బేడీ ఏమన్నారంటే!

టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్.. గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ!

నాని ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘ప్యారడైజ్ ‘ మళ్ళీ వాయిదా..?

మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

సూర్య రికార్డు బద్దలు.. 2026 వరల్డ్ వైడ్ టాప్ సౌత్ గ్రాసర్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’!

×