E-Paper

Ind vs Afg: ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?

Ind vs Afg: ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?
Advertisement

Ind vs Afg:  టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ ( India vs Afghanistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026) జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు పూర్తికాగా.. మరో మ్యాచ్ మిగిలి ఉంది. అయితే నిన్న లక్నో (Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium) వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 170 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 154 పరుగులతో రెచ్చిపోయిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill), తన మెడకు ఓ తెల్లటి గుడ్డ కట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, అది కనిపించక పోయినప్పటికీ.. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మెడలో ముఠా మేస్త్రిలాగా వేసుకున్నాడు. ఇక తన వికెట్ కోల్పోయే వరకు మెడలో ఆ తెల్లటి గుడ్డను మైంటైన్ చేశాడు. దీంతో అసలు గిల్ మెడలో ఉన్న తెల్లటి టవల్ గురించి చర్చ మొదలైంది. అసలు ఎందుకు దాన్ని ధరించాడని సోషల్ మీడియాలో అభిమానులు చర్చిస్తున్నారు.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా ( India vs Afghanistan) మధ్య లక్నో వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ సందర్భంగా 154 పరుగులతో రెచ్చిపోయిన గిల్.. తన మెడలో తెల్లటి వస్తువు ధరించాడు. దాన్ని కూలింగ్ నెక్ టవల్ (Cooling neck towel) అని పిలుస్తారు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు గిల్. దానికి తోడు లక్నోలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైన క్రమంలో, వడగాలులు కూడా వచ్చాయి.

అయితే అక్కడ ఉన్న టెంపరేచర్ భరించ లేక, ఈ కూలింగ్ నెక్ టవల్ (Cooling neck towel) ధరించాడు గిల్. ఇది మెడలో వేసుకుంటే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. శరీరం మాత్రం కూల్ గా ఉంటుంది. ఈ కూలింగ్ టవల్ లోపల జెల్ ప్యాక్ లేదా ఐస్ ముక్కలు ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేసి మెడలో ధరిస్తారు. ఫుట్ బాల్ ఆడేటప్పుడు కూడా కొంత మంది ఆటగాళ్లు దీన్ని ధరిస్తారు. లక్నో లో నిన్న మ్యాచ్ జరగగా, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill) కూడా ఈ కూలింగ్ టవల్ ధరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

Women’s T20 World Cup 2026: పాకిస్తాన్ రెండో ఓట‌మి…ప్ర‌మాదంలో టీమిండియా ?

మొహ్సిన్ నఖ్వీకి ప్ర‌మోష‌న్‌..ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

మైదానంలోనే కుప్ప‌కూలిన‌ శ్రేయాంక పాటిల్..నేరుగా ఇండియా ఫ్లైట్ ఎక్కించిన బీసీసీఐ !

×