Raj Kundra offers kidney to Guru: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90’sలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టింది. పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. మరోవైపు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటోంది. తరచూ శిల్పాశెట్టి దంపతులు వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మధ్య రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఫిర్యాదు
ఇటూ శిల్పా శెట్టి కూడా పలుమార్లు డబ్బులు చీటింగ్ ఆరోపణలను ఎదుర్కొంది. గతంలో ఫైనాన్షీ, కంపెనీ పెట్టుబడుల పేరుతో ఇతరుల వద్ద కోట్లలో డబ్బు తీసుకుని మోసం చేసినట్టు శిల్పాశెట్టి, ఆమె తల్లి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల మరోసారి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలపై కూడా చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వ్యవహరం బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. ఓ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి వీరు రూ. 60 కోట్లు మోసం చేశారంటూ దీపక్ కొఠారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వారిపై కేసు నమోదైన తరుణంలో తాజాగా శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్వామీజీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వీరు మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆధ్యాత్మిక గురువు రాజ్‌కుంద్రా తన కిడ్నీ దానం ఇస్తాననంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలు మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయనతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు.
నా కిడ్నీ ఇస్తాను గురువుగారు
దీనికి రాజ్‌కుంద్రా స్పందిస్తూ.. “గత రెండేళ్లు నేను మీ ప్రవచనాలు వింటూ మిమ్మల్ని అనుసరిస్తున్నాను. మీరు ఎంతో మందికి స్పూర్తి. మీలాంటి వారికి ఆరోగ్యం బాగలేదంటే మీకు సాయం చేయడం మా అదృష్టంగా భావిస్తాను. ఎలాంటి సంకోచం లేకుండ నా కిడ్నీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మికు చేయగలిగిన సాయం ఇదొక్కటే” అని తన అభిమానాన్ని చాటుకున్నాడు రాజ్‌కుంద్రా. ఇక అతడి మాటలకు స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు “నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నీ మంచి మనసు ఏంటో అర్థమైంది. కానీ, ఆ దేవుడు నుంచి మనకు పిలుపు వచ్చే వరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లలేం” అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.