Tollywood: ఈ మధ్యకాలంలో అటు హీరోలు, ఇటు హీరోయిన్లు సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేసి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా సామాన్యుల పెళ్లిళ్లు అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక పబ్లిక్ ఫిగర్స్ అయిన సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎంగేజ్మెంట్ మొదలుకొని.. వారు వివాహం జరిగి వెకేషన్ కి వెళ్లే వరకు వీరికి సంబంధించిన ఏదో ఒక విషయం వైరల్ అవుతూ ఉంటుంది. కానీ మరి కొంతమంది మాత్రం వార్తల్లో నిలవడం ఇష్టం లేక రహస్యంగా పెళ్లి చేసుకొని ఒకేసారి ఆ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకొని, సడన్ షాక్ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరో విశ్వంత్ (Viswanth ) కూడా ఒకరు అని చెప్పాలి. తాజాగా ఈ నటుడు ఏకంగా పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
కేరింత సినిమాతో హీరోగా గుర్తింపు..
అసలు విషయంలోకి వెళ్తే.. కేరింత సినిమాతో నటుడిగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నారు విశ్వంత్. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇదే సినిమాతో హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు విశ్వంత్.. ఈ సినిమా హిట్ అవడమే కాకుండా విశ్వంత్ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించాడు విశ్వంత్. కథ వెనుక కథ, తోలు బొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, ఓ పిట్ట కథ, జెర్సీ, మనమంతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు.
సడన్ గా పెళ్లి పీటలెక్కిన హీరో విశ్వంత్..
ఇకపోతే ఇప్పుడు ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా తన జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు విశ్వంత్. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతూ భావన (Bhavana ) అనే అమ్మాయితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం గమనార్హం. ఈయన పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావిడి లేకుండా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.
విశ్వంత్ కెరియర్..
విశ్వంత్ కెరియర్ విషయానికి వస్తే.. ఈయన పూర్తి పేరు విశ్వంత్ దుద్దుంపూడి. కేరింత సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటలో జన్మించారు. విశాఖపట్నంలోని టింపాని స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత హైదరాబాద్ కి మారారు. ఇక వైజాగ్ లో FIITJEE లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈయన కోయంబత్తూర్ లోని పిఎసిజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ లో ఇంజనీరింగ్ చేయడానికి తమిళనాడు వెళ్లి.. తదుపరి చదువుల కోసం న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్లారు. ఇక ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచారు.
also read: Prabhas: ఆ సత్తా చాటిన ఏకైక హీరోగా ప్రభాస్.. ఏకంగా ఐదు చిత్రాలు!