Arjun Tendulkar Engagement: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ చరిత్రలోనే సచిన్ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తన ఆటతీరుతో క్రికెట్ రంగంలోనే ఓ మైలురాయిగా నిలిచి క్రికెట్ గాడ్ గా పేరు సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ వయసు పై బడటంతో క్రికెట్ రంగానికి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను తీసుకువచ్చారు. అర్జున్ టెండూల్కర్ దేశవాళి క్రికెట్ లో గోవా తరపున ఆట ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున తన ఆట తీరును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ తన ఆటతీరుతో గుర్తింపు సొంతం చేసుకోలేకపోయాడు. క్రికెట్లో సక్సెస్ సాధించలేకపోతున్నారు.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే
అయినప్పటికీ అర్జున్ టెండూల్కర్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా…. గత రెండు రోజుల నుంచి అర్జున్ టెండూల్కర్ కు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ చాలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి జాతీయ మీడియా ఛానల్లో కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అర్జున్ ప్రముఖ బిజినెస్ మెన్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరి ఎంగేజ్మెంట్ కు అది కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారట. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఎంగేజ్మెంట్ గురించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
సానియా కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలు అని తెలుస్తోంది. వీరికి బిజినెస్ లు అధికంగా ఉన్నాయట అంతే కాకుండా సానియా కూడా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటారని సమాచారం అందుతోంది. ఒక రకంగా చూసుకుంటే అర్జున్ టెండూల్కర్ కు మించిన ఆస్తులు సానియా వద్ద ఉన్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది అయితే వివాహ సమయంలో అర్జున్ కు కట్నంగా దాదాపు 500 కోట్ల రూపాయలను ఇస్తున్నారని సమాచారం అందుతుంది. కట్నం తీసుకోవడం అర్జున్ కు పెద్దగా ఇష్టం లేకపోయినా సానియా కుటుంబ సభ్యులు బహుమతుల రూపంలో వీటిని అందజేస్తున్నారట. ఖరీదైన విల్లాలు, కార్లు, ఆభరణాలు, వాచ్ లు, దుస్తులు అన్నింటినీ కలిపి దాదాపు 500 కోట్ల విలువైన వస్తువులను అందిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం పైన సచిన్ టెండుల్కర్ కుటుంబ సభ్యులు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.