90’s A Middle Class:సొంటినేని శివాజీ ( Sontineni Sivaji).. ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన.. ‘ దిల్’ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి.. ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, సత్యవతి వంటి చిత్రాలలో నటించి.. తన అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా కామెడీ హీరోగా ఆకట్టుకున్న శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా ఇండస్ట్రీకి దూరమై.. మళ్లీ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరి హృదయాలు దోచుకున్నారు. నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈయన ఇక్కడ విజేతగా నిలుస్తారనుకున్నారు కానీ అనూహ్యంగా ఆ రేస్ నుండి తప్పుకొని ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
90′ స్ వెబ్ సిరీస్ కి అవార్డుల పంట..
ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత 90’స్ వెబ్ సిరీస్ లో ఒక తండ్రిగా, టీచర్గా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు.. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నాని(Nani ) నిర్మాణంలో రామ్ జగదీష్ (Ram Jagadeesh) దర్శకత్వం వహించిన ‘కోర్ట్’ సినిమాలో విలన్ గా నటించి.. తనలోని మరో కోణాన్ని అందరికీ పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు శివాజీ. ఇదిలా ఉండగా ఇటీవల ఈయన నటించిన 90’స్ వెబ్ సిరీస్ తాజాగా అవార్డుల పంట పండించింది. మరి ఏ విభాగంలో.. ఎవరెవరికి అవార్డ్ లు లభించిందో.. ఇప్పుడు చూద్దాం.
సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ లో సత్తా చాటిన 90’స్ వెబ్ సిరీస్..
తాజాగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఇందులో ఓటీటీ విభాగంలో ఈ ’90’ స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ కి అవార్డులు లభించాయి. దీనిని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హాసన్ (Adithya haasan), బాల నటుడు రోహన్ రాయ్ (Rohan Rai) కు ఈ పురస్కారాలు లభించడం జరిగింది. ఇక ఈ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల మధ్య హైదరాబాదులో జరిగింది. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్మాత అశ్విని దత్ కు , పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్లకు ఈ వేడుకలో ఘన సన్మానం జరిగింది.
అవార్డ్స్ జాబితాలో వీరు కూడా..
ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు చేతులమీదుగా విజేతలకు పురస్కారాలు ప్రధానం చేశారు.. ఇక ఇక్కడ మరో విశేషమేమిటంటే ‘కన్నప్ప’ చిత్రంలో బాల నటుడిగా తెరకు పరిచయమైన మంచు విష్ణు (Manchu Vishnu) కొడుకు అవ్రామ్ కి.. మోహన్ బాబు, మంచు విష్ణు, అశ్వినీ దత్ చేతుల మీదుగా అవార్డు అందించారు. ఉత్తమ నటుడిగా మంచు విష్ణు కి కూడా కన్నప్ప సినిమాకు అవార్డు లభించింది. అలాగే కోటా శ్రీనివాసరావు స్మారక అవార్డును నటుడు మోహన్ బాబుకు అందించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో శివాజీ, కాట్రగడ్డ ప్రసాదు, మురళీమోహన్ , అనంత శ్రీరామ్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవ్వడంతో శివాజీ 90స్ వెబ్ సిరీస్ మూవీ అవార్డు గ్రహీతలకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
ALSO READ:Manushi Chillar: సెలైన్ బాటిల్ తో కనిపించిన మానుషీ చిల్లర్.. ఏమైందంటూ ఫాన్స్ ఆందోళన!