Manushi Chillar: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి జిమ్ బాట పడుతున్న విషయం తెలిసిందే. గంటలు తరబడి జిమ్లో కష్టపడుతూ శరీరాన్ని ఒక ఆకృతికి తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా కష్టపడే సమయంలో అప్పుడప్పుడు అనారోగ్య బారిన పడుతున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది జిమ్లో భాగంగా హాస్పిటల్ పాలవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం అభిమానులకు ఆందోళనను కలిగిస్తున్నాయి. మొదటి ఫోటోలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఆ నెక్స్ట్ ఫోటోలో సడన్ గా సెలైన్ ఎక్కించుకుంటూ కనిపించేసరికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దీనికి “బ్లూ లైట్.. రెడ్ లైట్” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
సెలైన్ ఎక్కించుకుంటూ కనిపించిన మానుషీ చిల్లర్..
ఈమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ మానుషీ చిల్లర్ (Manushi Chillar).. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వెకేషన్ కి వెళ్ళినా.. ఈవెంట్ కు వెళ్లినా.. సందర్భం ఏదైనా సరే ఫోటోలు మాత్రం అభిమానులతో పంచుకోవాల్సిందే. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. నేలపై కూర్చొని థైస్, నడుము అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.. అలాగే ఇంకో ఫోటోలో చేతికి సెలైన్ పెట్టుకొని ఉండడంతో ఏమైందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటోల కింద క్యాప్షన్ గా..” సోమవారం రోజు బద్ధకంగా అనిపిస్తోంది.. నేను ఈ ఆటను రెడ్ లైట్, బ్లూ లైట్ అని పిలుస్తాను” అంటూ జోడించింది.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
అయితే ఈ క్యాప్షన్ కి.. ఆమె షేర్ చేసిన ఫోటోలకి అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సోమవారం రోజే జిమ్ చేయడానికి బద్ధకంగా అనిపిస్తుంది. కానీ గ్లామర్ ప్రదర్శనకు ఎలాంటి బద్ధకం లేదా అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది జిమ్లో అందాల ప్రదర్శనతో కష్టపడి నీరసమొచ్చి అందుకే సెలైన్ ఎక్కించుకుంటుంది అంటూ కామెంట్ చేశారు.. మరొకరేమో మీరు చాలా హాట్ మేడం అంటూ ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
17 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించిన ఘనత..
మానుషీ చిల్లర్ విషయానికొస్తే.. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. భారతదేశానికి 17 సంవత్సరాల తర్వాత వచ్చిన విజయం కావడంతో ఈమె మరింత పాపులారిటీ అందుకుందని చెప్పవచ్చు. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో హర్యానాకు ప్రాతినిధ్యం వహించిన ఈమె.. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను గెలుచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
మానుషీ చిల్లర్ సినిమాలు..
ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్ సినిమాలో అవకాశం అందుకుంది..ఆ తర్వాత బడే మియా చోటే మియా అండ్ మాలిక్ సినిమాలో నటించిన ఈమె.. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలెంటైన్ వంటి చిత్రాలలో కూడా నటించింది.
ALSO READ:Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!