BigTV English

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను అస్సలు తినొద్దు !

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను అస్సలు తినొద్దు !

Weight Loss: పండ్లు ఆరోగ్యానికి మంచివి కావు. వాటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు అన్ని రకాల పండ్లను తినకూడదు. కొన్ని పండ్లలో అధికంగా చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణం కావచ్చు. అందుకే.. సరైన పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునేవారు తినకూడని కొన్ని పండ్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. మామిడిపండు :
మామిడిపండు ‘పండ్లకు రాజు’. దీని రుచి చాలా బాగుంటుంది. కానీ.. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక కాదు. ఒక మామిడిపండులో దాదాపు 150-200 కేలరీలు, అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి.. మామిడిపండ్లను పరిమితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి.

2. ద్రాక్షపండ్లు :
ద్రాక్షపండ్లు చూడటానికి చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటిలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు ద్రాక్షలో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే, కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది.


3. అరటిపండ్లు :
అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. కానీ, వీటిలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మధ్యస్థాయి అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు అరటిపండ్లకు బదులుగా తక్కువ కేలరీలు ఉన్న పండ్లను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ అరటిపండ్లు తినాలనుకుంటే.. వ్యాయామం చేసిన తర్వాత కొద్దిగా తీసుకోవడం మంచిది.

4. పనసపండు :
పనసపండులో పీచు పదార్థం అధికంగా ఉన్నప్పటికీ.. దీనిలో చక్కెర , కేలరీలు చాలా ఎక్కువ. ఒక కప్పు పనసపండులో దాదాపు 155 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు ఈ పండును ఎక్కువగా తినకూడదు.

5. సపోటా:
సపోటాలో సహజమైన చక్కెరలు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న సపోటాలో కూడా 80-100 కేలరీలు ఉంటాయి. ఈ పండును ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

6. సీతాఫలం :
సీతాఫలం రుచి చాలా తియ్యగా ఉంటుంది. దీనిలో కూడా చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక సీతాఫలంలో 100-120 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేవారు ఈ పండును మానేయడం లేదా చాలా తక్కువగా తినడం మంచిది.

Also Read: నిమ్మ గడ్డితో.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

ముఖ్య గమనిక:
పైన పేర్కొన్న పండ్లలో కూడా పోషకాలు ఉంటాయి. కానీ బరువు తగ్గాలనుకునేటప్పుడు వాటిని పరిమితంగా తీసుకోవడం లేదా తక్కువ కేలరీలు ఉన్న పండ్లకు (ఉదాహరణకు, యాపిల్, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, స్ట్రాబెర్రీస్) ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పండ్లలోని ఫ్రక్టోజ్ అనే చక్కెర అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వుగా మారుతుంది. అందుకే.. మీరు తినే పండ్ల పరిమాణాన్ని, రకాన్ని బట్టి మీ బరువు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. పండ్లతో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా బరువు తగ్గడానికి చాలా అవసరం. ఏదైనా ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

Related News

Lemon Grass Tea: నిమ్మ గడ్డితో.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Kadaknath Chicken: వావ్! నల్ల మాంసం ఇచ్చే కోడి.. దీనిని తింటే ఆ వ్యాధులన్నీ పరార్..

Cookware Products: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Breakfast: ఉదయం టిఫిన్ చేయడం మానేస్తే.. ఏమౌతుందో తెలుసా ?

Dark Spots: ముఖం పై నల్ల మచ్చలు.. ఇలా చేస్తే చిటికెలో మాయం

Big Stories

×