Nirmal Accident: నిర్మల్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లకి వెలితే ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో నాలుగు అంతస్తుల భవనం పైనుంచి ఓ మహిళ దూకింది. మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం పైకి మహిళ ఎక్కింది. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతగా మహిళను పోలీసులు గుర్తించారు.
సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో సంగీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకోవాలంటూ సంగీతతో ఫోన్‌లో పోలీసు సిబ్బంది మాట్లాడారు. సుమారు అరగంట పాటు భవనం పైనే ఉంటూ కిందకు దూకుతానని సంగీత హెచ్చరించింది. పలువురు భవనం ఎక్కి కాపాడే ప్రయత్నం చేసిన దూకుతానని సంగీత వాదించింది.
ఈ సంఘటనతో ఘటనా స్థలంలో భారీగా స్థానికులు గుమిగూడారు. దూకవద్దంటూ ఫోన్‌లో పోలీసులు సముదాయిస్తుండగానే ఒక్కసారిగా భవనం పైనుంచి సంగీత అనే మహిళ దూకింది. పోలీసులు, స్థానికులు చూస్తుండగానే నాలుగు అంతస్తుల భవనం పైనుంచి మహిళ దూకింది. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే సంగీతను హుటాహుటిన అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించించారు.
Also read: రాప్తాడు ఘటన వ్యవహారం.. ఆసుపత్రి నుంచి నిందితుడు డిశ్చార్జ్, పోలీసుల విచారణ మొదలు