Shruti Haasan: విశ్వ నటుడు కమలహాసన్ (Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్(Shruti Haasan). సింగర్ గా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్న ఈమె.. నిజజీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రేమ విషయాలు ఈమెను మానసికంగా డిప్రెషన్ లోకి తోసేసాయి. ఇక వాటి నుంచి బయటపడ్డ ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ.. ఆ సినిమాలతో సూపర్ హిట్ అందుకుంటూ దూసుకుపోతోంది.
దాచాల్సిన పనిలేదు.. సర్జరీపై శృతిహాసన్ కామెంట్స్..
ఇలాంటి సమయంలో శృతిహాసన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను సర్జరీ చేయించుకోవడం వెనుక అసలు కారణం చెప్పుకొచ్చింది. శృతిహాసన్ మాట్లాడుతూ..” నేను టీనేజ్ లో ఉన్నప్పుడే నా ముక్కు నాకు నచ్చేది కాదు. అందుకే సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ముఖం మరింత అందంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా చేయించుకున్నా.. అయితే ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో నేను ఈ విషయం గురించి చెప్పాను. సాధారణంగా కొంతమంది దీని గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాను. నాలాగా ధైర్యంగా బయటకు చెప్పే వారిని ఇకపై తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
భవిష్యత్తులో అది కూడా చేయిస్తానేమో – శృతిహాసన్
అంతేకాదు భవిష్యత్తులో వయసు మీద పడ్డాక ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో తెలియదు.. అది కాలము.. నా అందాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. ఏదైనా సరే నా వ్యక్తిగత నిర్ణయాన్ని పూర్తిగా నేను గౌరవించుకుంటాను. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు ఎదుటివారు దాని గురించి నన్ను ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది?” అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం సర్జరీపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
శృతిహాసన్ కెరియర్..
కమలహాసన్ – సారిక (Sarika) దంపతుల పెద్ద కూతురిగా పేరు సొంతం చేసుకున్న ఈమె..’అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత మరి కొన్ని చిత్రాలు చేసింది. కానీ వరుస ఫ్లాప్స్ చవి చూడాల్సి వచ్చింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసిన తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పట్టిందల్లా బంగారమే అన్నట్టు.. ఈమె ఏ సినిమా చేసినా.. ఆ సినిమా సక్సెస్ అందుకుంది. అయితే మధ్యలో ప్రేమ, రిలేషన్, డేటింగ్ అంటూ కాస్త ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీలో దుమ్ము దులుపుతోంది శృతిహాసన్. ఇటీవలే అడవి శేష్ (Adavi shesh) ‘డెకాయిట్’ మూవీ నుండి తప్పుకున్న ఈమె.. రజినీకాంత్ కూలీ(Coolie) సినిమాలో నటిస్తోంది. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.