BigTV English

Amaravati Gateway: అమరావతి గేట్ వే.. ఇదొక అద్భుతమే.. వారెవ్వా అనేస్తారు!

Amaravati Gateway: అమరావతి గేట్ వే.. ఇదొక అద్భుతమే.. వారెవ్వా అనేస్తారు!

Amaravati Gateway: ప్రపంచం దిమ్మతిరిగేలా ఏపీలో ఒక కట్టడం నిర్మాణం అవుతోంది. ఇప్పటి వరకు ఎన్నో గేట్ వేలు చూసి ఉంటారు. కానీ ఇక్కడ నిర్మిస్తున్న గేట్ వే గురించి తెలుసుకుంటే, ఔరా అనేస్తారు. అందుకు వేదికగా మారింది ఏపీ రాజధాని అమరావతి. ఇప్పటికే ఎన్నో రికార్డులను దక్కించుకున్న అమరావతి అమ్ముల పొదిలో మరో రికార్డు చేరువ కానుంది. ఇంతకు ఆ రికార్డు ఏమిటి? అసలు గేట్ వే వింతలు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.


అమరావతి ఇది కేవలం ఒక పేరు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న మౌన చలనాలకి ఇప్పుడు కొత్త ఊపొస్తుందనిపిస్తోంది. మళ్లీ ఓ దిశగా అమరావతి వైపు అధికారులు, ఇంజినీర్లు కదులుతున్నట్టుంది. అయితే ఈసారి దృష్టి కేంద్రంలో ఉన్నది ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడే రాజధానికి ప్రధాన ద్వారం ఏర్పడబోతోందన్న వార్తలు అధికార వర్గాల్లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.

ఈ బ్రిడ్జి ఎక్కడా.. చూసి ఉండరేమో!
ఇప్పటికే విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడి మూలపాడు వద్ద ఒక ప్రతిష్ఠాత్మకమైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ బ్రిడ్జి కేవలం ఓ ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ గానే కాకుండా, అమరావతి నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా మారే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. అందుకే, మూలపాడు ప్రాంతాన్ని అమరావతికి ప్రధాన ప్రవేశ ద్వారంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో భూకణాలను పరీక్షించేందుకు అక్కడ మట్టి నమూనాల పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


ఈ భూసామర్థ్య పరీక్షలు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పై అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది కేవలం ఒక సాధారణ పరీక్ష ప్రక్రియ కాదు.. ఇది రాజధాని యొక్క భవిష్యత్ ప్రవేశద్వారానికి వేసే మొదటి అడుగు అని చెప్పవచ్చు. మూలపాడు ప్రాంతం రాజధానికి దగ్గరగా ఉండడమే కాకుండా, రవాణా దృష్టికోణంలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అందువల్లే అధికార యంత్రాంగం ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తూ, అక్కడే ఐకానిక్ బ్రిడ్జితో కూడిన గేట్‌వే అభివృద్ధికి పునాదులు వేస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తే, మూలపాడు ప్రాంతం అమరావతి నగరానికి ప్రధాన ఎంట్రీ పాయింట్‌గా మారనుంది. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి వేగంగా పెరిగే అవకాశముంది. ఒకవేళ మూలపాడు ద్వారా రాజధాని అభివృద్ధికి తొలి అడుగు పడితే, అక్కడి స్థానికులకు, వ్యాపారికులకు, రవాణా రంగానికి ఎంతో లాభం చేకూరుతుంది. అంతేగాకుండా, విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రముఖులకూ ఇదే ప్రధాన మార్గంగా నిలవనుంది.

Also Read: Visakhapatnam New Roads 2025: వైజాగ్ ట్రాఫిక్‌కు ఇక సెలవు.. కొత్త రోడ్లకు గ్రీన్ సిగ్నల్..!

ఇకపోతే, మూలపాడు బ్రిడ్జి ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం వాహనాల రాకపోకలకే కాదు, నగర ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా ఒక ఐకానిక్ ఆర్కిటెక్చర్‌గానూ నిర్మించనున్నారు. శిల్పకళ, ఆధునిక నిర్మాణ శైలి కలబోతగా ఇది ఉండనుంది. ఒక నగరాన్ని గుర్తించే ప్రధాన ద్వారం ఎలానీ ఉండాలో దానికి ఇది ఒక ప్రేరణగా నిలవబోతోంది. విదేశీ మోడళ్లను పరిశీలించి, ఉత్తమ డిజైన్‌ను ఎంచుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదొక అద్భుతం..
ఇక మొట్టమొదటగా మూలపాడును ఎంపిక చేయడానికి మరో కారణం.. ఇది విజయవాడకు అత్యంత సమీపంగా ఉంది. విజయవాడ మెట్రో రైలు, రింగ్ రోడ్ల ప్రాజెక్టులతో కలిపి అమరావతికి తీసుకెళ్లే ప్రధాన రహదారిగా దీన్ని అభివృద్ధి చేయవచ్చు. దీంతో పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలు మరియు ఆస్తి విలువలు అన్నీ పెరిగే అవకాశముంది. మూలపాడు పేరే వచ్చే రోజుల్లో హాట్ లొకేషన్‌గా మారిపోవచ్చని అంటున్నారు రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా.

ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతుండగా, వాస్తవిక దిశగా ముందడుగులు పడుతున్నాయి. అలా ముందుగా ప్రారంభించబోయే ప్రధాన అడుగు.. గేట్‌వే టు అమరావతి అనేది మూలపాడులో ఉండబోతుందన్న సంకేతాలు ఇప్పుడు అధికార వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మట్టినమూనాల పరీక్షలు ఆ ప్రాంత భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లుగా భావించవచ్చు.

మొత్తంగా చూస్తే, మూలపాడు ప్రాంతం ఒక సాధారణ గ్రామం నుండి రాజధానికి ముఖద్వారంగా అభివృద్ధి చెందబోతుంది. అక్కడ ప్రారంభించబోయే బ్రిడ్జి కేవలం కాంక్రీటు నిర్మాణం కాదు.. అది అక్షరాలా అమరావతికి తలుపుగా నిలవనుంది. ఇది రాజధాని నగరంలో అధికారిక అభివృద్ధి ప్రారంభమవుతోందని సంకేతమిచ్చే తొలి నిర్మాణం కావడం విశేషం. ఇక అమరావతికి మార్గం ఖరారవుతోంది, కదలిక మొదలైంది!

Related News

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Big Stories

×