E-Paper
Advertisement

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Maanasa Choudhary:మానసా చౌదరి …సినిమాలలో వేగం కాస్త తగ్గించినా నెట్టింట్లో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. ఇదిగో ఈ క్రమంలోనే తాజాగా వైట్ షర్ట్‌లో ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో చాలా సింపుల్‌గా, న్యాచురల్ లుక్‌లో కనిపించడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్న ఫోజులు 

Advertisement

సాధారణంగా హీరోయిన్లు ఫొటోషూట్స్ అంటే హెవీ మేకప్, స్టైలిష్ డ్రెస్‌లతో కనిపిస్తుంటారని చెప్పక్కర్లేదు.కానీ మానసా మాత్రం ఈసారి చాలా సింపుల్ లుక్‌ను ఎంచుకోవడం ఇక్కడ విశేషం.వైట్ షర్ట్, లైట్ మేకప్‌తో కూల్‌గా కనిపించడమే కాకుండా ఆమె ఎక్స్‌ప్రెషన్, ఫొటోలో ఇచ్చిన పోజ్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఇక మానసా చౌదరి కెరీర్ విషయానికి వస్తే ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో రోషన్ కనకాల సరసన హీరోయిన్‌గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే యూత్‌ను టార్గెట్ చేసుకున్న ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ భామ కెరీర్ కాస్త స్లో అయింది.

Advertisement

‘లక్కీ భాస్కర్’ సినిమాలో గెస్ట్ రోల్

ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కూడా.ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ నటనకు ఎంత పేరు వచ్చిందో, సినిమా కథకు కూడా అంతే పేరు రావడం విశేషం.

ఇక తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న మానసా చౌదరి గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా వెరైటీ రోల్స్ కూడా చేసేందుకు సిద్దమని పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది కూడా.ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మానసాకు మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఫొటోషూట్స్, ట్రావెల్ ఫొటోలు, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.

సింపుల్‌గా ఉన్నా చాలా అందంగా ఉన్నావ్

ఇక ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో కూడా అదే విధంగా వైరల్ అవుతోంది. ‘‘చాలా సింపుల్‌గా ఉన్నా చాలా అందంగా ఉన్నావ్’’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ‘న్యాచురల్ బ్యూటీ’ అంటూ మరికొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మొత్తానికి ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తన లుక్‌తోనే అందరిని తన వైపుకి తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ALSO READ :‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రస్తుతం మానసా చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ‘బబుల్‌గమ్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో చూడాలి.

Tags

Related News

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×