Brahmanandam Financial Discipline:బ్రహ్మానందం ..ఈయన గురించి పరిచయం చేస్తే కామెడీకి ఎలా నవ్వాలో నేర్పినంత కామెడీగా ఉంటుంది,కామెడీ పై ఆయనగారు వేసిన స్టాంప్ అలాంటిది మరి.
అలాంటి బ్రమ్మీ . వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా డబ్బు, జీవితం, మనుషుల గురించి బ్రమ్మీ మాటల్లో ఎప్పుడు ఒక ఫిలాసఫీ తొంగి చూస్తుంది కూడా.
అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్రహ్మానందం గురించి కొన్ని రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మహా పిసినారి అని,పిల్లికి బిచ్ఛం కూడా పెట్టడని , ఇక డబ్బు విషయంలో చాలా మొండిగా ఉంటారని, పెద్దగా ఖర్చు చేయడానికి ఇష్టపడరని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తుంటారు చాలా మంది .అయితే సాధారణంగా ఇలాంటి కామెంట్స్ పై సెలబ్రిటీలు పెద్దగా రియాక్ట్ అవ్వరు . కానీ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తనపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో ఇలా కౌంటర్ ఇచ్చాడు.
బ్రమ్మీ మాట్లాడుతూ డబ్బు సంపాదించడం ఒక్కటే జీవితంలో ముఖ్యమైన విషయం కాదని, సంపాదించిన డబ్బును సరైన సమయంలో, సరైన విధంగా ఉపయోగించడం కూడా అంతే అవసరమని తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన తనకు డబ్బు విషయంలో కొందరు చేసిన తప్పులు ప్రత్యక్షంగా కనిపించాయని, వాటి నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని బ్రహ్మానందం తన అనుభవాల్ని చెప్పుకొచ్చాడు.
తాను డబ్బు విషయం లో కాస్త కఠినంగా ఉండటాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారని ,అయితే తన దృష్టిలో అది పిసినారితనం కాదని, ఆర్థిక క్రమశిక్షణ అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఎంత డబ్బు సంపాదింస్తే దానికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని, ముఖ్యంగా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని డబ్బును మేనేజ్ చేసుకోవాలని ఆయన చెప్పిన మాటలపై నెటిజన్లు చర్చలు పెట్టడం విశేషం.
బ్రహ్మానందం కెరీర్ విషయానికి వస్తే.. చిన్న. చిన్న పాత్రల నుంచి అహ నా పెళ్లంట!, వివాహ భోజనంబు, ముత్యమంత ముద్దు, బాబాయ్ హోటల్, జంబలకిడి పంబ, మెకానిక్ అల్లుడు, శుభలగ్నం, జాతిరత్నాలు వంటి ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన కామెడీకి ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
ముఖ్యంగా మన్మథుడు, ఢీ, కింగ్, దూకుడు, రేసుగుర్రం, బాద్‌షా, అదుర్స్, దూకుడు వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ మీమ్స్, సోషల్ మీడియా వీడియోల్లో కనిపిస్తూనే ఉంటాయి.
తన దగ్గర డబ్బు ఉందని చెప్పుకోవడం కోసం కాదు.. అవసరమైన చోట ఆ డబ్బు ఉపయోగపడాలని తాను భావిస్తానని అందులో భాగంగానే పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు సహాయం చేసిన విషయాన్ని ఆయన చెప్పడం బట్టి చూస్తే డబ్బు ని ఎంత బాగా సాయం కోసం ఎదురుచూసేవాళ్ళకి ఖర్చు పెడతాడో అర్థం అవుతుంది.
తాను డబ్బు విషయంలో కఠినంగా ఉండటం వల్లే త23 మంది పేద ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయగలిగానని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.