E-Paper
Advertisement

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?
Advertisement

Devi Sri Prasad: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad). ఈయన సంగీత సారధ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా సంగీత దర్శకుడుగా తెర వెనుక తన మ్యూజిక్ తో అందరిని మ్యాజిక్ చేసిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే వెండితెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. ఈయన హీరోగా ఎల్లమ్మ (Yellamma)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

జంటగా కనిపించిన ఐశ్వర్య రాజేష్, దేవిశ్రీ..

ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అనేది మాత్రం చిత్ర బృందం అధికారకంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా తాజాగా దేవిశ్రీప్రసాద్ మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) తో కలిసి జంటగా ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఇలా వీరిద్దరూ మొదటిసారి జంటగా కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి.

ఎల్లమ్మ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్?

Advertisement

దేవిశ్రీ ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారా? అందుకే ఇలా జంటగా దర్శనమిచ్చారా? అంటూ కొందరు సందేహాలను వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం అనుకోకుండా ఇలా కలిసారేమో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారా?అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దేవిశ్రీప్రసాద్ ఐశ్వర్య రాజేష్ ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలి అంటే వాళ్ళు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ వరుసగా తెలుగు,తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

హీరోగా దేవిశ్రీ సక్సెస్ కొట్టేనా..

ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా డివోషనల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ వేణు బలగం సినిమాతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దిల్ రాజు నిర్మాణంలో ఎల్లమ్మ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాకు హీరోలు దొరకని నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఎంపిక అయ్యారు కానీ ఇప్పటికీ కూడా హీరోయిన్ ఎవరు? ఏంటీ? అనే విషయాలను మాత్రం ఇంకా చిత్ర బృందం వెల్లడించలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు సందడి చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Related News

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×