E-Paper
Advertisement

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
Advertisement

Kiara Advani: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ మంచి పాపులారిటీ అందుకుంటున్న ఈమె.. తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మరోవైపు హుందాతనంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వం లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేశారు. కనీసం ఈ సినిమాతో నైనా ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందని అనుకోగా.. అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది .

అభిమానులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ..

దీంతో కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొడుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. పైగా హీరో తో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలతో విమర్శలు కూడా ఎదుర్కొంది. ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న ఈమె అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇలాంటి సమయంలో ఆమె తన అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తాను మళ్ళీ తల్లి కాబోతున్నాను అంటూ తన భర్త, కూతురుతో పాటు తన చేతులను కలిపి ఇంకొకరు తమ జీవితంలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Advertisement

ఈ మేరకు అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ కియారా అద్వాని ఈ విధంగా రాసుకొచ్చింది. ‘మరోసారి మా జీవితంలో అత్యంత గొప్ప బహుమతిని అందుకోబోతున్నాము. మా హృదయాలు ఎంతో ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి ” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కియారా అద్వానీ షేర్ చేసిన ఫోటో గమనిస్తే.. తన భర్త, తన అరచేతుల్లో తెల్లటి నూలు బేబీ సాక్స్ ను తన కూతురు సారాయా చేతితో పట్టుకున్నట్టు ఒక క్యూట్ ఫోటోని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె మళ్లీ రెండోసారి గర్భవతి అని ప్రకటించడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి, పిల్లలు..

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి, పిల్లలు విషయానికి వస్తే.. ఈ జంట 2023 ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వీరికి 2025 జూలైలో ఒక పాప జన్మించింది. సారాయా మల్హోత్రా అని మొదటి సంతానంకు పేరు కూడా పెట్టారు. ఇప్పుడు మరో చిన్నారి తమ కుటుంబంలోకి రాబోతుండడంతో తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Related News

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

Big Stories

Advertisement
×