NTR -God Of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ సినిమా(Dragon Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని 2027 జూన్ 11వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ (NTR)తన తదుపరి సినిమాని మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ (God Of War) అనే టైటిల్ తో ప్రచారంలో ఉంది.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతుందని ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తెలియజేశారు.తాజాగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో, దర్శకత్వంలో ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో కలిసి ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా తరచు వాయిదా వేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని, సెకండ్ హాఫ్ కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాల్సి ఉందంటూ ఈ సినిమా విడుదల వాయిదా గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా ఆదర్శ కుటుంబం సినిమా తరచూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా విషయంలో ఆందోళన చెందుతున్నారు.
గ్రాఫిక్స్, VFX లేని సినిమాకే వరుస రీషూట్లు.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అంటూ తరచు వాయిదా వేస్తున్నారు.
ఇలా గ్రాఫిక్స్ లేని సినిమాకి రీషూట్ అంటే గాడ్ ఆఫ్ వార్ లాంటి భారీ మైథలాజికల్ మూవీని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తారూ? ఈ సినిమాకి ఇంకెంత టైం తీసుకుంటారు… టైం తీసుకున్నా సరైన అవుట్ ఫుట్ ఇవ్వగలరా? అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరుస్తూ ఆందోళన చెందుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా అంటేనే సాహసం అనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ తో చేయబోతున్న భారీ మైథాలజికల్ పాన్ ఇండియా సినిమాతో ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తారు వేచి చూడాలి.
Also Read: మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!