Dongana Koduku:‘లిటిల్ హార్ట్స్’ .. ఈ సినిమా బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కేవలం రెండు కోట్ల లోపే తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నలబై కోట్ల వసూల్లని చూడటంతో ముక్కున వేలేసుకుంది మూవీ ఇండస్ట్రీ. ఇక ఇందులో నటించిన యూట్యూబర్, నటుడు మౌళి తనుజ్ ప్రశాంత్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు.
ఇక ఇదే జోష్ లో తాజాగా దొంగనాకొడుకుగా మరోసారి ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపోయాడు.క్రైమ్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమ. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు కూడా.
నవంబర్ 13న రిలీజ్
నిజానికి ‘దొంగ నా కొడుకు’ సినిమాను సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అయితే తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ నవంబర్ 13ను రిలీజ్ డేట్ గా లాక్ చేసింది మూవీ టీమ్ .
ఇక పోస్టర్‌ను పరిశీలిస్తే సినిమా మొత్తం రాబరీ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీగా కనిపిస్తోంది. సాధారణ దొంగతనం కథకు కుటుంబ బంధాలు, కామెడీ, క్రైమ్ అంశాలను జోడించి సరి కొత్త ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
మౌళికి తండ్రి పాత్రలో సీనియర్ నటుడు అలీ
ఇక మౌళి తనుజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు అలీ మౌళికి తండ్రి పాత్రలో అలీ కనిపించనుండటం సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో లిటిల్ హార్ట్స్ లాగే తండ్రి, కొడుకుల మధ్య జరిగే సీన్స్ నవ్వులు తెల్లిస్తాయని తెలుస్తుంది.మౌళికి యూట్యూబర్ గా ఎంత మంచి గుర్తింపు ఉందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఆయన చేసిన వీడియోలు, కామెడీ కంటెంట్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. . ఆ తర్వాత నటుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన ‘లిటిల్ హార్ట్స్’తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.
పోస్టర్ ద్వారా హింట్
ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’తో మరోసారి తన కామెడీ యాంగిల్‌ను చూపించేందుకు రెడీ అయిపోయాడు. నిజానికి క్రైమ్ కామెడీ జానర్‌కు తెలుగులో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ‘బ్లేడ్ బాబ్జీ’, ‘స్వామి రారా’, ‘బ్రోచేవారెవరురా’, ‘మత్తు వదలరా’ వంటి సినిమాలు ఈ జానర్ లో వచ్చి సూపర్ హిట్ అయినవే.ఇపుడు అలాగే ‘దొంగ నా కొడుకు’ కూడా కథలో క్రైమ్ ఉన్నప్పటికీ ట్రీట్‌మెంట్ విషయంలో పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు పోస్టర్ ద్వారా హింట్ ఇస్తుంది మూవీ యూనిట్.
ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్నిప్రెజెంట్ చేయడం సినిమాకు మరింత ప్లస్ అనే చెప్పాలి. ఒకవైపు మౌళి లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న కుర్ర హీరో మరోవైపు అలీ లాంటి సీనియర్ కామెడీ నటుడు కలిసి కనిపించనుండటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
చూడాలి మరి శ్రీను కంబాల దర్శకత్వంలో నవంబర్ 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘దొంగ నా కొడుకు’ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
ALSO READ :ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!