E-Paper
Advertisement

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?
Advertisement

Nagarjuna: సాధారణంగా మొబైల్ ఫోన్ ఉందంటే చాలు.. నచ్చిన ప్రదేశంలో.. నచ్చిన విధంగా సెల్ఫీలు దిగుతూ ఆనందం పొందుతూ ఉంటాము. ముఖ్యంగా ఫోటోలు తీసుకోవడానికే కొంతమంది మొబైల్ ఫోన్లు తీసుకుంటారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మన మధురమైన జ్ఞాపకాలను భద్రంగా ఈ ఫోన్లో దాచుకుంటూ ఉంటాం.. అయితే అలాంటిది సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ) మాత్రం ఇప్పటివరకు ఒక్క ఫోటో కూడా ఉంచుకోలేదట. పైగా తన ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండకపోవడానికి గల కారణాన్ని చెబుతూనే.. ప్రతి 15 రోజులకు ఒకసారి తన ఫోన్లో అలాంటి విషయాలన్నీ చెక్ చేస్తాను.. అంటూ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నా ఫోన్లో ఒక ఫోటో కూడా ఉండదు – నాగార్జున

ఒకవైపు వరుస సినిమాలలో హీరోగా.. మరొకవైపు ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ.. ఇంకొక వైపు రియాలిటీ షో బిగ్ బాస్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. బిజీగా మారిన ఈయన.. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఒక సైబర్ భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొని , తన ఫోన్ వినియోగం, వ్యక్తిగత డేటా భద్రతకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముందుగా తన ఫోన్లో వ్యక్తిగత ఫోటోలను తీసుకోకపోవడం , భద్రపరచుకోకపోవడం లాంటి విషయాలపై మాట్లాడుతూ..” నేను నా ఫోన్లో వ్యక్తిగత ఫోటోలు దాచుకోను. ముఖ్యంగా ఎప్పుడైనా ఫోన్ హ్యాక్ అయితే అందులోని ఫోటోలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం వుంది. అందుకే ఫోన్ లో సాధ్యమైనంత వరకు వ్యక్తిగత డేటాను నేను స్టోర్ చేసుకోను” అంటూ తెలిపాను.

ప్రతి 15 రోజులకు ఒకసారి కొత్త పాస్ వర్డ్..

Advertisement

ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలు వెతుకుతున్న నేపథ్యంలో.. ముందుగానే తాను సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా అప్రమత్తంగా ఉండడం నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ఫోన్ భద్రత విషయంలో నేను పాటించే మరో ముఖ్యమైన జాగ్రత్త.. ప్రతి 15 రోజులకు ఒకసారి నా మొబైల్ పాస్వర్డ్ మార్చడం, వై-ఫై పాస్వర్డ్ ని మార్చడం ద్వారా అనధికారికంగా ఫోన్ లోకి ప్రవేశించే అవకాశాలు కొంతవరకు తగ్గుతాయి. ఒక్క పాస్వర్డ్ విషయంలోనే కాదు ఇంటర్నెట్ కనెక్షన్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటాను.. నా ఇంటి వైఫై పాస్వర్డ్ ని కూడా నేను తరచూ మార్చుకుంటాను. సాధారణంగా ఒకటి రెండు నెలలకు ఒకసారి వైఫై మార్చే అలవాటున్న నేను ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో సురక్షితంగా ఉండడం కోసం ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి వైఫై మారుస్తాను ” అంటూ తెలిపారు.

ALSO READ: మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన..

Advertisement

ఇకపోతే ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని, గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం లాంటివి చేయకూడదు అంటూ కూడా అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలకు, హ్యాకింగ్ కి సెలబ్రిటీలతో పాటు ప్రజలు కూడా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి అంటూ నాగార్జున సలహాలు ఇచ్చారు.

Related News

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

Big Stories

Advertisement
×