Shraddha Kapoor:శ్రద్ధా కపూర్ …వరుస సక్సెస్ లతో బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒక రకంగా చెప్పాలంటే తన అందంతోనే కాకుండా ,నటనతో కూడా స్టార్స్ గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతోంది ఈ అందాల భామ .
అయితే కేవలం సినిమాలతోనే కాకుండా, ఈ అమ్మడుఅప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో కూడా అభిమానులని పలకరిస్తూనే ఉంటుంది. ఇక వీటికి పెట్టే క్యాప్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.ఇదే క్రమంలో ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఈసారి శ్రద్ధా కపూర్ ఆరెంజ్ కలర్ ట్రెడిషనల్ చీరలో మెరిసిపోయిందనే చెప్పాలిఇక ఆ చీరపై ఉన్న గోల్డెన్ వర్క్, దానికి మ్యాచింగ్‌గా వేసుకున్న ట్రెడిషనల్ జ్యూవెలరీ ఆమె లుక్‌ను మరింత క్లాసీగా మార్చేశాయి.
ఇక మెడలో హెవీ నెక్లెస్, చెవులకు జుంకాలు, ముక్కుపుడకతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ సందడి చేయడం విశేషం.ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్మైల్ కి యూత్ ఫిదా అయిపోయారు.
మొత్తంగా వెస్ట్రన్ డ్రెస్సుల్లోనే కాదు, చీరకట్టులోనూ మెస్మరైజ్ చేయగలనని మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ అందాల భామ.అయితే, ఈ ఫొటోలు ఎంతలా అలరిస్తున్నాయో ,వాటికి పెట్టిన క్యాప్షన్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకోవడం విశేషం.
“కుచ్ కహా ఆప్‌నే ?” అంటూ ఫ్యాన్స్‌తో సరదాగా మాట్లాడినట్టుగా పోస్ట్ పెట్టేసింది ఈ అమ్మడు.ఇక ఈ పోస్ట్ చూసితమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కొందరు ఆమె అందాన్ని ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు ఈ ట్రెడిషనల్ లుక్‌లో చాలా బాగున్నారని, ఇంకొందరైతే మాటలు రావడం లేదని, ఇలాంటి చీరకట్టులో మరిన్ని ఫొటోలు పెట్టాలని రిక్వెస్ట్ చేయడం విశేషం .
ఇక శ్రద్ధా కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2010లో ‘తీన్ పట్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ ఆమెకు అసలైన బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి . అందులో ఆరోహి పాత్రలో ఆమె నటన, ఆ పాటల్లోని ఎమోషన్స్ యూత్‌కు ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యాయి.
ఆ తర్వాత ‘ఏక్ విలన్’, ‘హైదర్’ సినిమాలతో సత్తా చాటిన శ్రద్దా కేవలం లవ్ స్టోరీలే కాకుండా ‘ఏబీసీడీ 2’, ‘బాఘీ’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘హసీనా పార్కర్’ లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకుంది కూడా.
ముఖ్యంగా 2018లో వచ్చిన హారర్ కామెడీ ‘స్త్రీ’ ఆమె కెరీర్‌నే మార్చేసిందనడం లో సందేహం లేదు. ఇక తెలుగు లో ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయింది.
ఇక హిందీ లో ‘చిచ్చోరే’ సినిమాతో పాటు రణబీర్ కపూర్‌తో కలిసి ‘తూ ఝూతీ మై మక్కార్’తో హిట్ కొట్టింది ఈ బ్యూటీ .అయితే 2024లో వచ్చిన ‘స్త్రీ 2’ అయితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి స్పృష్టించి శ్రద్ధా క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది.ఇక ప్రస్తుతం ఈథా అంటూ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. చూడాలి డిసెంబర్ 4న పలకరించనున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
also read:చిన్నప్పుడు విన్న భయంకరమైన కథే ‘భోగి’కి స్ఫూర్తి.. అసలు విషయం బయటపెట్టిన సంపత్ నంది!