E-Paper
Advertisement

Raju Weds Rambai: సక్సెస్ ఈవెంట్ డేట్ ఫిక్స్, చీఫ్ గెస్ట్‌గా ఆ క్రేజీ హీరో

Raju Weds Rambai: సక్సెస్ ఈవెంట్ డేట్ ఫిక్స్, చీఫ్ గెస్ట్‌గా ఆ క్రేజీ హీరో
Advertisement

Raju Weds Rambai Success Meet: ఈరోజుల్లో ఒక గొప్ప సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్ని సినిమాలు జనాల వద్దకు రీచ్ అవ్వడానికి ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ అనేది బాగా వైరల్ అవ్వాలి. ఈరోజుల్లో చాలామంది సంగీత దర్శకులు కూడా వాళ్ళు చేసే సాంగ్స్లో ఒక బిట్ అయినా ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తుంటారు.

సక్సెస్ ఈవెంట్ ఫిక్స్

ఇంస్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు ఈ పాట ఏ సినిమా లోనిది అనే ఆసక్తి కొద్దిగా మొదలవుతుంది.  ఆ తర్వాత ఫుల్ సాంగ్ వింటూ సినిమా మీద అంచనాలు పెంచుకుంటారు. అయితే ఆ సాంగ్ సినిమాలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి మొదలవుతుంది. ఇలా సాంగ్స్ హిట్ అవ్వడం వలన సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి కూడా “గోదారి గట్టుమీద రామచిలకవే” అనే పాట బాగా పాపులర్ అవడం వల్లనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

బాక్సాఫీసుకు భారీ వసూళ్లు

Advertisement

ఇకపోతే నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.  ఈరోజుల్లో ఒక సినిమా పొద్దున విడుదల అయితే సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టడం అనేది కామన్ గా జరిగిపోతుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించి గ్రాటిట్యూడ్ మీట్ పెట్టారు. అంటే సినిమాని ఆదరించిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించి సక్సెస్ ఈవెంట్ కూడా మంగళవారం నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా సిద్దు జొన్నలగడ్డ హాజరవుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజె టిల్లు అనే సినిమా విపరీతమైన ఫేమ్ తీసుకొచ్చింది.

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు వెనక ఉన్న రహస్యం, మొత్తానికి బయట పెట్టిన కొండన్న

సిద్దు రావడానికి కారణం ఇదే

Advertisement

ఈ సినిమాలో వెంకన్న అనే పాత్రలో కనిపించాడు చైతన్య జొన్నలగడ్డ. ఈ చైతన్య జొన్నలగడ్డ స్వయంగా సిద్దు జొన్నలగడ్డకు అన్నయ్య. అయితే చాలా చిన్న ఏజ్ లోనే అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోయి, కొంతకాలం తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటుడుగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే బబుల్గం, హిట్ 3 సినిమాల్లో నటించాడు చైతన్య జొన్నలగడ్డ. అయితే రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో వెంకన్న అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకన్న అనే పాత్ర గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. చైతన్యకు ఈ సినిమాతోనే విపరీతమైన పేరు వచ్చింది. అయితే అద్భుతమైన గుర్తింపు చైతన్యకు లభించింది కాబట్టి సినిమా కూడా సక్సెస్ అయింది కాబట్టి సిద్దు ఈవెంట్ కి వస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ చైతన్య పాత్ర గురించి ఏ రేంజ్ లో మాట్లాడుతారు సక్సెస్ మీట్ లో తెలుస్తుంది.

Related News

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

Big Stories

Advertisement
×