E-Paper
Advertisement

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!
Advertisement

Revanth Reddy: హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడటంతో పాటు మురుగునీటి శుద్ధి , ట్రీటెడ్ వాటర్ పునరుపయోగాన్ని పెంచడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, సీఎంఓ, జలమండలి, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిస్థితిని సమీక్షించారు.

ఏఐ టెక్నాలజీ, సోలార్ పవర్‌తో ప్లాంట్ల నిర్వహణ

Advertisement

వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సీఎం ఆదేశించారు. ప్రాసెస్ చేసే నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ప్లాంట్లను సోలార్ పవర్‌తో నడిపే అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రతి ప్లాంట్ వద్ద ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించాలని సూచించారు. వీటిపై హైడ్రా ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో 100% ట్రీటెడ్ వాటర్ తప్పనిసరి

Advertisement

ప్రభుత్వ ఆఫీసులు, సెక్రటేరియట్, సీఎం కార్యాలయ ల్యాండ్‌స్కేప్‌లు, పబ్లిక్ పార్కులలో వంద శాతం ట్రీటెడ్ వాటర్ మాత్రమే వాడాలని తేల్చి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు ఇతర రహదారుల క్లీనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ కోసం ఈ నీటినే ఉపయోగించాలన్నారు. మెట్రో రైల్, రైల్వే డిపార్ట్‌మెంట్‌తో పాటు భారీ డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త నియమాలు

కొత్త భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే ట్రీటెడ్ వాటర్ వినియోగించాలనే నిబంధన విధిస్తారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లకు జిపిఎస్ ట్రాకింగ్ పద్ధతి తెస్తున్నారు. ఈ నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

నవంబర్ 1 నాటికి ప్రణాళికలు పూర్తి చేసి, డిసెంబర్ నుంచి ఈ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని, అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు.

Also Read: BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!

Tags

Related News

ఉపాధి పనులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ..!

BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!

కరువు పై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగిస్తాం!- చానగాని దయాకర్

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన సైఫాబాద్ పోలీసులు!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!

రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

Big Stories

Advertisement
×