Pawan Kalyan: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు అని మొదటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఆ వీడియో విపరీతమైన అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అందరికీ అర్థమైంది.
ఎప్పుడో రిలీజ్ కావలసిన హరిహర వీరమల్లు సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ సినిమా నుంచి కొన్ని కారణాల వలన క్రిష్ జాగర్లమూడి కూడా బయటకు వెళ్లిపోయారు. అక్కడితో కొంతమందికి ఆసక్తి కూడా నశించింది. జాగర్లమూడి వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ.
సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. కానీ ఈ వీడియోలో ఎక్కడా దర్శకుడు క్రిష్ కనిపించలేదు.
క్రిష్ ను మరువని కళ్యాణ్
ఈ సినిమా కాన్సెప్ట్ గురించి పవన్ కళ్యాణ్ నేడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రిష్ గురించి మాట్లాడారు. కృష్ణా నది తీరం కొల్లూరు నుంచి, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం గోల్కొండ రాజులు దాకా వచ్చింది. హైదరాబాద్ సుల్తానుల వరకు ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఎటు వెళ్ళింది. ఈ నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి. చాలా హై కాన్సెప్ట్ తో ఈ సినిమాను నా దగ్గరికి పట్టుకొచ్చారు. ఆయన ఏం రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు నచ్చి వెంటనే చేశాను. నేను ఒకటి సిన్సియర్ గా చెప్తున్నాను. క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్ తో నా దగ్గరికి వచ్చాడు. కొన్ని వ్యక్తిగత కారణాలు, ప్రొఫెషనల్ కారణాలు వలన ఆయన ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లినా కానీ దీని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. ఆ యూనిట్ అందరి తరపున కూడా చెబుతున్నాను.
జ్యోతి పేరుతో తడబాటు
పవన్ కళ్యాణ్ కి మామూలుగా అందరి పేర్లు గుర్తుండవు. చాలా సందర్భాల్లో కొంతమంది పేర్లు మర్చిపోతూ ఉండరు. ముఖ్యంగా తన సినిమాలు సంబంధించి హీరోయిన్ పేర్లు కూడా పవన్ కళ్యాణ్ కు అంతగా గుర్తుండవు. అయితే క్రిష్ పేరును చాలా ఫాస్ట్ గా పట్టుకున్న పవన్ కళ్యాణ్ జ్యోతి పేరును తలుచుకోవడంలో కొద్దిపాటి తడబాటు చెందారు. ఇక్కడితో క్రిష్ మాత్రమే గుర్తున్నాడు జ్యోతి కృష్ణ పేరు మర్చిపోయాడు అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ను అనడం మొదలుపెట్టేసారు.
Also Read : Pawan Kalyan : నేను యాక్సిడెంటల్ యాక్టర్, నాకు గత్యంతరం లేకపోతే ఆ పని చేసుకునేవాడిని