BigTV English

Samantha: సినిమాలకు ముందు సమంత చేసిన యాడ్స్ ఇవే.. అస్సలు గుర్తుపట్టలేరు

Samantha: సినిమాలకు ముందు సమంత చేసిన యాడ్స్ ఇవే.. అస్సలు గుర్తుపట్టలేరు

Samantha: సమంత (Samantha)సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా ఏం మాయ చేసావే(Yem Maaya Chesaave) సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ అంతకుముందే ఈమె ఎన్నో యాడ్స్ చేస్తూ సందడి చేశారు. తాజాగా ఈ యాడ్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ ఇక్కడ ఉన్నది సమంతనా? వామ్మో అసలు గుర్తుపట్టలేక పోతున్నాము కదా.. అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.


సినిమాలకు ముందు సమంత ఇన్ని యాడ్స్ చేసిందా..

ఇకపోతే సమంత అప్పట్లో చాలా అందంగా బొద్దుగా ఉండేది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అప్పటికి ఇప్పటికీ సమంత చిరునవ్వులో ఏమాత్రం మార్పు లేదు చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఏ మాయ చేసావే సినిమా అవకాశం రాకముందు ఈమె టర్మరిక్ పౌడర్ కి సంబంధించిన ఒక యాడ్ చేశారు. అదేవిధంగా ఆషిక అనే గోల్డ్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తూ ఈమె ఒక యాడ్ చేశారు. ఈ యాడ్ వీడియోలో ఈమె ఆ గోల్డ్ గురించి తెలియజేస్తూ ఎంతో చలాకిగా కనిపించారు. అలాగే పరిమళం టాల్కం పౌడర్ ప్రమోట్ చేస్తూ కూడా ఒక యాడ్ వీడియోలో నటించారు. వీటితోపాటు చిక్ షాంపును కూడా ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మధ్య తరగతి కుటుంబం నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా..

ఇక ఈ వీడియోలో సమంత గుర్తుపట్టలేని విధంగా ఎంతో బొద్దుగా కనిపించి సందడి చేశారు. సమంత ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అలాగే మోడలింగ్ చేసే సమయంలోనే కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం ఈమె గౌతమ్ మీనన్ దృష్టిలో పడటం ఆయన ఏ మాయ చేసావే సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. నాగచైతన్య(Nagachaitanya) సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

?igsh=bXI4MDFtd3FieDBl

హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు పరిచయం అవుతూనే మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సమంతకు తెలుగు తమిళంలో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం నిర్మాతగా కూడా మారి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు  నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లయిన మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈమె ప్రస్తుతం డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Related News

Coolie: 14 న సినిమా రిలీజ్ అయితే 15న ఈవెంట్, ఎవరా క్రియేటివ్ జీనియస్.?

NTR Look : బక్కచిక్కిపోయిన తారక్… ఈ ప్రయోగాల ఫలితమేనా ఇది ?

Coolie Ticket Rates : రజనీకాంత్ కూలీ క్రేజ్… ఒక్క టికెట్ ధర రూ.4500

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Upasana Konidela : రామ్ చరణ్ తో పెళ్లికి ముందే డేటింగ్.. సీక్రెట్ రీవిల్ చేసిన ఉపాసన…

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

Big Stories

×