Yellamma Movie: టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు.. ఇది అక్షరాల నిజం.. ఇప్పటికే చాలామంది తమ టాలెంట్ నిరూపించుకొని ప్రస్తుతం జనాల నోట్లో నానుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది కమెడియన్లు యాక్టర్లు డైరెక్టర్లుగా మారి సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ కమెడియన్ వేణు ఒకరు. గత ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బలగం మూవీతో డైరెక్టర్ గా మారాడు.. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన వేణు యెల్దండి ఇప్పుడు మరో మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు.. ప్రస్తుతం ఈయన ఎల్లమ్మ మూవీని చేస్తున్నాడు.. ఈ మూవీ గురించి ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే తాజాగా దీని గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ ని పెట్టి రిస్కు చేస్తున్నాడు అంటూ ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది..
సినిమాకు 100 కోట్లు..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఏడాది ఒక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా తప్ప మిగిలిన సినిమాలు నిరాశను మిగిలిచ్చాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు..వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఊహించని విధంగా సూపర్ బజ్ ఏర్పరచింది.. నితిన్ తమ్ముడు సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత చేస్తున్న ఎల్లమ్మని కూడా ఒక రేంజ్ లో తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు దిల్ రాజు.. ఈ మూవీకి భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నాడని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఎల్లమ్మ సినిమాకు దిల్ రాజు 100 కోట్ల దాక పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాను కేవలం తెలుగ్ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ భాషలన్నిటిలో కుదిరితే పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.. నితిన్ కు ఈమధ్య హిట్ సినిమాలు పడలేదు అయితే ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి రిస్క్ చేయడం అవసరమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…
Also Read :వామ్మో.. పొట్టిదే కానీ గట్టిగానే లాగుంతుంది.. ఒక్కరోజుకు అంతనా..?
ఎల్లమ్మ షూటింగ్ అప్డేట్..
వేణు యెల్దండి డైరెక్షన్ లో వస్తున్న రెండో మూవీ ఎల్లమ్మ. ఈ సినిమాను చాలా నెలల కిందటే అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో నాని నటిస్తున్నాడనీ అప్పట్లో వార్తలు వినిపించాయి.. కానీ నాని సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ మూవీ మరో హీరో దగ్గరకు వెళ్ళింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ దగ్గరకు ఈ చిత్రం వెళ్ళింది. నితిన్ కెరీర్ లో రాబోతున్న తమ్ముడు క్రేజీ మూవీగా వస్తుండగా ఆ తర్వాత ఎల్లమ్మ కూడా వేరే లెవెల్ అనేలా ఉంటుందని అంటున్నారు. బలగం తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఎల్లమ్మ సినిమాను వేణు ఎలా తీస్తాడన్నది చూడాలి. తమ్ముడు సినిమా అటు ఇటు అయినా కూడా ఎల్లమ్మ సినిమాతో మంచి టాక్ ని సొంతం చేసుకుంటాడని.. కమ్ బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు..