BigTV English

Sitaare Day 1 Collections: అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

Sitaare Day 1 Collections: అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

Sitaare Day 1 Collections: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ మధ్య వరుస బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య పెద్దగా ఆయనకు అనుకున్న హిట్ సినిమాలు పడలేదు. ప్రస్తుతం ఆయన మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది.. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ అంచనాలతో నిన్న థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షోతోనే పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. మరి కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం..


‘సితారే జమీన్ పర్’ కలెక్షన్స్.. 

జూన్ 20 న బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. అందులో కుబేర మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తుండటంతో కలెక్షన్స్ కూడా భారీగానే కలెక్ట్ చేసి ఉంటుందని సమాచారం. అదే విధంగా బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ థియేటర్లలోకి భారీ అంచనాలతో వచ్చేసింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ కేవలం 11.05 కోట్లు వసూల్ చేసిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అమీర్ చివరి సినిమా లాల్ సింగ్ చద్దా 11.70 కోట్లు మొదటి రోజు వసూల్ చేసింది. అంతగా కూడా వసూల్ చెయ్యక పోవడం పై బాలీవుడ్ జనాలు పెదవిరుస్తున్నారు.


Also Read :చిరు, బాలయ్య… చిన్న పల్లెటూరుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు..

అమీర్ ఖాన్ సినిమాలు.. 

గత కొంతకాలంగా అమీర్ ఖాన్ సినిమా కెరీర్ అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నది. సితారే జమీన్ పర్ సినిమాకు ముందు దాదాపు మూడు, నాలుగు సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పటివరకు చేసిన అన్నీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి సమయంలో తన సత్తాను నిరూపించుకొనేందుకు సితారే జమీన్ పర్ సినిమాతో ముందుకు వచ్చారు. అయితే దీనికి మొత్తం 80 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టినట్లు తెలుస్తుంది. భారీగా ప్రమోషన్స్ నిర్వహించినప్పటికీ సితారే జమీన్ పర్ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ కనిపించడం లేదు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ అంత గొప్పగా కనిపించలేదు.. దాంతో మూవీ కలెక్షన్స్ తగ్గాయని బాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం. ఈ వీకెండు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా బాలీవుడ్లో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే.. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకుంటున్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు బాలీవుడ్ లో రాలేదని చెప్పాలి.. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు వస్తాయో అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

Related News

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Big Stories

×