Man Elopes Daughter In Law| కొన్ని నెలల క్రితం ఒక విచిత్ర ఘటన జరిగింది. కాబోయే అల్లుడితో ఒక మహిళ పారిపోయింది. వెళ్లిపోతూ ఇంటి నుంచి నగదు, బంగారం అంతా దోచుకుని వెళ్లిందని ఆమె భర్త ఆరోపించాడు. ఆ తరువాత ఆమె పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయింది. ఇకపై తన కుర్ర ప్రియుడితోనే తన జీవితమని మీడియాతో చెప్పింది. ఇలాంటిదే ఒక ఘటన తాజాగా మళ్లీ జరిగింది. తన కొడుకుతో పెళ్లి నిశ్చయమైన ఒక యువతితో ఒక వ్యక్తి పారిపోయాడు. అతనికి ఇంట్లో భార్య, ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. తమ ప్రేమ గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయినా అతను భయపడలేదు. పైగా భార్యను కొట్టాడు. ఆ తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తనకు కాబోయే కోడలిని వివాహం చేసుకున్నాడని ఆ తరువాత తెలిసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పట్టణానికి చెందిన షకీల్ (49) అనే వ్యక్తికి షబానా అనే మహిళతో 26 క్రితమే వివాహం జరిగింది. వారిద్దరికీ ఆరుగురు పిల్లలున్నారు. ఆ ఆరుగురిలో షకీల్ తన 16 ఏళ్ల కొడకు వివాహాన్ని ఒక 15 ఏళ్ల యువతితో కొన్ని నెలల క్రితం నిశ్చయించాడు. ఆ తరువాత నుంచి తన కాబోయే కోడలి ఇంటికి తరుచూ వెళ్లేవాడు. ఆ తరువాత ఆ యువతితో ప్రతిరోజు ఫోన్ లో వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. ఇదంతా చూసి అతని భార్య షబానా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా షకీల్ తన ప్రవర్తన మార్చుకోలేదు.
షకీల్ తన కాబోయే కోడలిని తీసుకొని సినిమాలకు, షికార్లకు తిరుగుతున్నాడని తెలిసి అతని కొడుకు ఇక తాను ఆ యువతితో పెళ్లి చేసుకునేది లేదని ఇంట్లో చెప్పేశాడు. కొడుకు ఆ యువతితో పెళ్లికి నిరాకరించాడని షకీల్ అతనిపై కోపడ్డాడు. ఆ తరువాత షకీల్ ఎలాగైనా ఆ యువతిని తన ఇంటికి తీసుకొని రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తాను ఆ యువతిని వివాహం చేసుకుంటానని చెప్పగా.. ఇంట్లో గొడవలు జరిగాయి.
షకీల్ కు అడ్డు చెప్పిన అతని భార్య షబానాను అతను చితకబాదాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న రూ.2 లక్షలు నగదు, 17 గ్రాముల బంగారం తీసుకొని వెళ్లిపోయాడు. మరుసటి రోజు షకీల్ ఆ యువతిని పెళ్లికున్నాడని తెలిసి అందరూ షాకైపోయారు. షకీల్ రెండో పెళ్లికి అతని తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారని వారి అండదండలతోనే షకీల్ ఈ వివాహం చేసుకున్నాడని అతని భార్య షబానా చెప్పింది.
కాబోయే అల్లుడితో అత్త జంప్
ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి అసాధారణ, వివాదాస్పద పారిపోయే సంఘటనలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి తరచూ కుటుంబ సభ్యుల మధ్య లేదా సాంప్రదాయ వివాహ నియమాలను ఉల్లంఘించే విధంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 16న, సప్నా దేవి (42) అనే మహిళ తన కూతురు పెళ్లి చేసుకోబోయే యువకుడైన రాహుల్‌తో పెళ్లికి కొన్ని రోజుల ముందు పారిపోయింది. వారు 3.5 లక్షల రూపాయల నగదు, 5 లక్షల విలువైన ఆభరణాలు తీసుకొని పారిపోయారిన స్వప్నా దేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పోలీసుల లొంగిపోయిన సప్న తనను కొడుతున్నాడని.. తాను గృహ హింసను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: విమానాన్ని కూల్చేస్తా.. సిబ్బందిని బెదిరించిన మహిళా డాక్టర్
ఈ సంఘటనలు సాంప్రదాయ కుటుంబ విలువలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. అందుకే సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.