Allari Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఒకటి. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా నిర్మాత నాగవంశీ (Nagavamshi) సరికొత్త చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరొక కొత్త సినిమాని ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) పుట్టినరోజు (Birthday)సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించారు.
ఆకట్టుకుంటున్న ఆల్కహాల్ పోస్టర్ …
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “ఆల్కహాల్” (Alcohol)అనే టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా భ్రమ, నిజానికి మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.
ఆల్కహాల్ మత్తులో నరేష్…
ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. మెహర్ తేజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా నటి రుహాని శర్మ(Ruhani Sharma) నటించబోతున్నారు. ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ మరొక విభిన్నమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో అల్లరి నరేష్ కేవలం కామెడీ నేపథ్యంలోనే కాకుండా విభిన్న జోనర్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక అల్లరి నరేష్ చివరిగా బచ్చల మల్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విభిన్న కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమర్షియల్ గా ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన కమిటైన ఆల్కహాల్ సినిమా చూస్తుంటే మాత్రం ఈ సినిమాతో అల్లరి నరేష్ హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాత కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నాగవంశీ జడ్జిమెంట్ ఎప్పుడు తప్పదని, ఈ సినిమాతో నరేష్ ఖాతాలో హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు.
Also Read: నిజాలు చెప్పిన ఎవరు నమ్మట్లేదు.. ట్రోల్స్ పై ఫైర్ అయిన అభిషేక్!