Abhisekh Bachchan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల పట్ల ఎన్నో రకాల విమర్శలు వస్తుంటాయి. సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వారిలో పాజిటివ్ అంశాల కంటే కూడా నెగిటివ్ విషయాలను తెలుసుకుంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాలను చూసి చూడనట్టు వదిలేయగా, మరి కొంతమంది మాత్రం వారి గురించి వచ్చే విమర్శలపై స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు.
ఐశ్వర్యరాయ్ తో విడాకులు…
తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhisekh Bachchan)సైతం తన గురించి వచ్చే విమర్శలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తనపై వచ్చే విమర్శల గురించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈయన తన భార్య నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) కి విడాకులు(Divorce) ఇచ్చారని తన నుంచి దూరంగా ఉంటున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలొచ్చాయి అయితే ఈ విడాకుల రూమర్లపై ఎప్పటికప్పుడు అభిషేక్ ఖండించిన కూడా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు దీంతో ఈయన కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
తప్పుడు కథనాలు..
ఇప్పటివరకు తన గురించి వచ్చినటువంటి ఇలా తప్పుడు వార్తలపై స్పందించకపోవడానికి గల కారణాలను కూడా ఈయన తెలియజేశారు.
గత కొంతకాలంగా నా గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. ఆధారాలు లేని తప్పుడు కథనాలను కూడా తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు . తన గురించి వచ్చే విమర్శలపై తాను స్పందిస్తే వాటికి మరింత బలం చేకూర్చినట్టు అవుతుందని అందుకే తాను స్పందించలేదని తెలిపారు. ఇలా స్పందించకపోవడం వల్ల ఈ విమర్శలు మరింత అధికమయ్యాయి. వీటి కారణంగా నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడుతున్నారని ఈయన తెలియజేశారు. నా గురించి ఏ వార్తలు అయితే బయటకు వచ్చాయో వాటి గురించి నేను నిజం చెప్పిన పట్టించుకునే వారు ఎవరూ లేరు.
పాజిటివ్ వార్తలను నమ్మరు..
ఒక నెగిటివ్ వార్తను నమ్మినంతగా, పాజిటివ్ వార్తను ఎవరు నమ్మటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెగిటివ్ వార్తలు కారణంగా నేను ఎంత బాధ పడుతున్నానో ఆ వార్తను సృష్టించిన వారికి తెలియదు. ఏదో కంప్యూటర్ ముందు కూర్చుని వారికి తోచినట్టుగా వార్తలు రాస్తే సరిపోతుందా.. ఆ వార్తల కారణంగా ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది అంటూ ఈయన ట్రోలర్స్(Trollers) పై మండిపడ్డారు. ఇన్ని రోజులు కూడా తన గురించి వచ్చిన విమర్శలను తేలిగ్గా తీసుకున్న అభిషేక్ బచ్చన్ ఈసారి మాత్రం చాలా సీరియస్ అవుతూ ట్రోలర్స్ కు తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే అభిషేక్ బచ్చన్ నటించిన “కాళిధర్ లాపత” సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.. ఇక ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
Also Read: తమిళనాట కన్నప్పకు ఘోర అవమానం… విష్ణు ఇది చూస్తే తట్టుకోగలడా ?