BigTV English

Kannappa Fan :మంచు మావయ్యా.. ‘కన్నప్ప’ సినిమాకు చూస్తానంటూ చిన్నారి పేచీ, విష్ణు స్పందన ఇదే

Kannappa Fan :మంచు మావయ్యా.. ‘కన్నప్ప’ సినిమాకు చూస్తానంటూ చిన్నారి పేచీ, విష్ణు స్పందన ఇదే

Kannappa Fan :మంచు విష్ణు(Manchu Vishnu) చాలా రోజుల తర్వాత కన్నప్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భక్తకన్నప్ప ఆ శివయ్య పై తనకున్న భక్తిని ఎలా చాటుకున్నారనే కథ నేపథ్యంలో ఇదివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ అదే కథతో మరోసారి మంచు విష్ణు కన్నప్ప అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రెండు రోజులు మంచి ఆదరణ లభించినప్పటికీ ప్రస్తుతం మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు పడిపోయాయని తెలుస్తోంది. ఇక తమిళనాడులో అయితే ఈ సినిమాకు ఏ మాత్రం ఆదరణ దక్కలేదని ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాకు సంబంధించిన షో క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


మొదటి రెండు రోజులు ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి మంచి విష్ణు మాత్రం నిత్యం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచుతున్నారు. అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఓ చిన్నారి కన్నప్ప సినిమా కోసం పెద్ద ఎత్తున ఏడుస్తున్నట్టు తెలుస్తుంది.

కన్నప్ప చూడాల్సిందే…


ఇక ఈ వీడియోని సతీష్ నారాయణ అని ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేశారని తెలుస్తుంది. ఈ వీడియోలో చిన్నారి కింద పడి దొర్లుతూ ఏడుస్తూ కనిపించారు. అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారికి ఈరోజు విష్ణు నటించిన కన్నప్ప సినిమా చూపించాలని గోల చేస్తుందని, నాకైతే ఈరోజు కొన్ని పనుల కారణంగా కుదరలేదు అంటూ సతీష్ నారాయణ అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇక ఈ వీడియోని తిరిగి విష్ణు షేర్ చేస్తూ .. “యు మేడ్ మై డే” అంటూ రెండు చేతులు జోడిస్తున్న ఎమోజిలతో పాటు హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా విష్ణు పీఆర్ స్టంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్నారితో భలే మేనేజ్ చేయిస్తున్నారు అన్నా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక మొదట రెండు రోజులు కూడా ప్రభాస్ (Prabhas) కారణంగానే థియేటర్ కు ప్రేక్షకులు తరలి వెళ్లారు. ప్రభాస్ కారణంగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు విష్ణు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర(Rudra) అనే పాత్రలో నటించిన విషయం తెలిసింది దాదాపు అరగంట పాటు ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఉన్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం మొదటి రోజు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు.

Also Read: నిండా మందులో మునిగిపోయిన అల్లరి నరేష్.. ఈ సారి ‘ఆల్కహాల్’తో ఎంట్రీ

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×