Coolie: కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది.
ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ మంచి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళం స్టార్ సౌబిన్ లు రజినీకాంత్ తో పాటు కనిపించనున్నారు. వీళ్ళందరికీ అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు లోకేష్. ట్రైలర్ లో కూడా అందరికీ ఒక ప్రాముఖ్యత ఉంది.
మరో ఇద్దరు యంగ్ హీరోలు
సినిమా మొదలైనప్పుడు నుంచి ఎవరెవరు నటిస్తున్నారు అంటూ అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ స్టార్స్ మాత్రమే కాకుండా, ఇంకో ఇద్దరు యంగ్ హీరోలు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శివ కార్తికేయన్, అలానే జీవా కూడా కూలీ సినిమాల్లో కామియో రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన అయితే రాలేదు. వీళ్ళతో లోకేష్ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అనేది థియేటర్లో తెలుస్తుంది. ఒకవేళ మీరు సినిమాలో లేనట్లయితే ఇవి ఒట్టి పుకార్లు అని తేలిపోతుంది. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒకవైపు శృతిహాసన్, మరోవైపు లోకేష్, అలానే అనిరుద్ ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నారు.
మరో వారం రోజుల్లో
ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాని ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాత నాగ వంశీ వార్ 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి మొదట కూలి సినిమా రైట్స్ కొనే ప్రయత్నం చేశాడు వంశీ. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఆ సినిమా లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం. ఇక ప్రస్తుతం శివ కార్తికేయం ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాశి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సింగిల్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.