Malle Chettu:వైష్ణవి సోనీ …ఫోక్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సాలిడ్ గా వినిపిస్తున్న పేరిది.ముఖ్యంగా బాసింగ బలాలు అనే పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ అమ్మాయి ఈ మధ్య వరుస ఫోక్ సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఎంతలా అంటే వచ్చిన ప్రతీపాట మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకునేంతంగా .ఇదిగో ఈ క్రమంలోనే ఈశ్వర్ సాయితో చేసిన మల్లె చెట్టు అనే పాట ఎనిమిది నెలల్లోనే ఏకంగా 84 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని ఫోక్ ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది.
ఫోక్ ఇండస్ట్రీలో తనదైన మ్యూజిక్ తో సెన్సేషన్ హిట్స్ ఇస్తున్న కళ్యాణ్ కీస్ ఈ పాటకి మ్యూజిక్ అందించగా ఈశ్వర్ సాయితో కలిసి వైష్ణవీ సోనీ వేసిన స్టెప్పులకి ఫిదా అయిపోయారు ఆడియన్స్.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎన్నో సూపర్ హిట్స్ కి కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ ఈ ఆపాటని స్టెప్పులని కంపోజ్ చేయగా బొద్దు దిలీప్ తన గాత్రంతో పాటకి ప్రాణం పోశాడనే చెప్పాలి.
ఇక అందమైన ఈ పాటకి గుర్రం శ్రవణ్ కుమార్ అందించిన లిరిక్స్ కూడా బాగా కలిసివచ్చాయనే చెప్పాలి.ఇక పాటలో ఈశ్వర్ సాయి ,వైష్ణవీ సోనీ ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ పాటని మరో లెవెల్ కి తీసికెళ్ళింది.అన్నింటికీ మించి పాటలో పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చినట్టు కనబడటం ,అందమైన విజువల్స్ పాటని మరో రేంజ్ కి తీసికెళ్ళాయి.ఒకరకంగా ఈ ఆర్గానిక్ లుక్కే పాటని ఈ స్థాయికి చేర్చిందని చెప్పాలి .
ఇక కొరియోగ్రఫీ అందించిన శేఖర్ వైరసే ఈ పాటకి దర్శకత్వం చేయగా కమ్లీ పటేల్ అందించిన సినిమాటోగ్రఫీ పాటకి ఎసెట్ గా నిలిచింది.ఇక ఎడిటింగ్ బాధ్యతలని హరి తోట తీసుకోగా పాటని శేఖర్ గౌడ్ నిర్మించారు.గతంలో రాను బొంబాయికి రాను ,మామిడి కోనాల మీద ,పెద్దిరెడ్డి వంటి పాటలు ఏ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాయి ఈ [పాట కూడా అంతకి మించి పేరు తెచ్చుకుంటుందని కామెంట్స్ వదులుతున్నారు ఫోక్ లవర్స్ .
ఏది ఏమైనా ఈ రోజుల్లో ఒక పాట 80 మిళియన్లని బీట్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు.పాట ఆడియన్స్ కి ఎంతగానో కనెక్ట్ అయితేనే తప్ప.మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాట ఇపుడు ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతుందంటే దానికి ఈశ్వర్ సాయి ,వైష్ణవీ సోనీ ల అద్భుతమైన కెమిస్ట్రీ మనే కారణం అని చెప్పాలి.
చూడాలి మరి ఫోక్ ఇండస్ట్రీలో వరుసగా సాలిడ్ హిట్స్ కొడుతూ మాధురి రాథోడ్ వంటి వారికి పోటీగా నిలుస్తున్న వైష్ణవీ సోనీ ముందు ముందు ఎలాంటి పాటలతో అలరిస్తుందో !