Siva Nirvana Next Movie:ఇరుముడి ..బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రవి తేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250 కోట్లు కొల్లగొట్టడంతో శివ నిర్వాణ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.దీంతో ఇక శివ నిర్వాణ ఎవరితో జత కడతాడా అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.
తర్వాతి సినిమాని న్యాచురల్ స్టార్ తో
అయితే ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం శివ నిర్వాణ తన తర్వాతి సినిమాని న్యాచురల్ స్టార్ తో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది.అది కూడా ఒక సాలిడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతుందని, దీనిని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించబోతున్నాడని సమాచారం.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ సినిమాలు వచ్చిన సంగతి తెల్సిందే.నిన్ను కోరి వంటి సూపర్ హిట్ సినిమాతో శివ నిర్వాణ డెబ్యూ ఇవ్వడం విశేషం,ఇక టక్ జగదీశ్ సినిమా కోవిడ్ టైమ్ లో రావడంతో డైరెక్ట్ గా అమెజాన్ లో రిలీజ్ అయి నెగెటివ్ టాక్ ని మూటగట్టుకుంది.మరి ఇదే కాంబో ముచ్చటగా మూడో సారి ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
వినిపిస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ
అయితే ఇక్కడ నానితో పాటు శివ నిర్వాణ జోడీ కట్టబోతున్నాడని వినిపిస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఖుషి సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.లవ్,ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పర్లేదనిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం సో సో గానే రాబట్టడం గమనార్హం. మొత్తానికి ఇరుముడి తో సక్సెస్ చూసిన శివ నిర్వాణ లైనప్ లో ఇపుడు నాని,విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తున్నాయన్న మాట.మరి వీరిలో ఎవరితో ఎప్పుడు ఎలా జత కడతాడో చూడాలి.
బాక్సాఫీస్ వద్ద పడుతూ లేస్తున్న ఫ్యారడైజ్
ఇక నాని విషయానికి వస్తే ఫ్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పడుతూ లేస్తున్నప్పటికీ ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలని లైనప్ చేస్తుండటం ఇక్కడ విశేషం.ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’తో బిజీ కానున్న నాని, దీనితో పాటు వెంకీ అట్లూరి తో కూడా జత కట్టబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది.
ఫుల్ బిజీ అయిన విజయ్ దేవర కొండ
ఇక ఇటు విజయ్ దేవర కొండ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి అలాగే హయ్ నాన్న ఫేమ్ శౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీ అయిన సంగతి తెల్సిందే.మరి శివ నిర్వాణ నానితో ముచ్చటగా మూడో సినిమాకి శ్రీకారం చుడతాడా లేక విజయ్ దేవరకొండతో మరో సినిమాని పట్టాలెక్కిస్తాడా చూడాలి.
ఏది ఏమైనా ఇరుముడి వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత శివ నిర్వాణ చేయబోయే సినిమాపై అందరి దృష్టి ఉంటుందన్న సంగతి తెల్సిందే.చూడాలి మరి భారీ అంచనాలాని మోస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ ఎవరితో జత కడతాడో !