E-Paper
Advertisement

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్
Advertisement

Zebronics County Bluetooth speaker: ప్రస్తుత డిజిటల్ యుగంలో పార్టీలు చేస్తున్నప్పుడు.. ఇంట్లో మ్యూజిక్ వినడానికి లేదా చిన్న పాటి గెట్-టుగెదర్‌లలో పాటలు వినడానికి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు ఎంతో అవసరంగా మారాయి. అయితే.. మంచి ఫీచర్లు ఉన్న స్పీకర్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తారు. ఆ అపోహను పూర్తిగా పటాపంచలు చేస్తూ.. సామాన్యుల బడ్జెట్‌కు సరి పోయేలా జెబ్రానిక్స్ సంస్థ ‘PSPK9 కౌంటీ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ట్రెండీ గాడ్జెట్ విశేషాలు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.డిజైన్ ,కాంపాక్ట్ సైజ్:

ఈ జెబ్రానిక్స్ కౌంటీ స్పీకర్ చూడటానికి చాలా చిన్నదిగా, అందంగా , కాంపాక్ట్ సైజ్‌లో ఉంటుంది. దీన్ని అర చేతిలో ఇముడ్చుకోవచ్చు లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లో చాలా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ దీనికి ఒక క్లాసిక్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లేవారికి లేదా ప్రయాణాలు చేసేవారికి ఇది ఒక చక్కటి ట్రావెలింగ్ కంపానియన్ అని చెప్పొచ్చు.

2.3W పవర్, క్లియర్ ఆడియో క్వాలిటీ:

Advertisement

ఈ గాడ్జెట్ చిన్నగా ఉన్నప్పటికీ, ఈ స్పీకర్ 3 వాట్ల అవుట్‌ పుట్ పవర్‌తో పవర్ ఫుల్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. మోనో ఛానల్ ఆడియో సపోర్ట్ కలిగిన ఈ స్పీకర్ ద్వారా పాటలు వినేటప్పుడు.. వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇంట్లో లేదా చిన్న రూమ్‌లలో కూర్చుని పాటలు ఆస్వాదించడానికి ఇది సరిగ్గా సరి పోతుంది.

3. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ :

ఈ స్పీకర్ కేవలం బ్లూ టూత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్లూటూత్ వాడకం ఇష్టం లేకపోతే.. ఇందులో అందించిన ‘ఆక్స్ ఇన్పుట్’కేబుల్ ద్వారా కూడా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు.

4. బిల్ట్-ఇన్ ఎఫ్ఎం రేడియో:

Advertisement

ఈ స్పీకర్ మరో ప్రత్యేక ఫీచర్ ఏంటంటే ఇందులో ‘బిల్ట్-ఇన్ ఎఫ్ఎం రేడియో’ సపోర్ట్ లభిస్తుంది. ఇంటర్నెట్ లేదా మొబైల్ అవసరం లేకుండా.. నేరుగా ఎఫ్ఎం రేడియో ట్యూన్ చేసుకొని మీ ఇష్ట మైన పాటలు, వార్తలు,ఆర్జేల మాటలను ఎంజాయ్ చేయొచ్చు. పాత రోజులను గుర్తుచేసే.. ఈ రేడియో ఫీచర్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డ్ లేదా యుఎస్‌బీ డ్రైవ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండటం మరో ప్లస్ పాయింట్.

Also Read: మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

5. పాకెట్ ఫ్రెండ్లీ ధర :

ఇన్ని రకాల అద్భుతమైన ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర కేవలం రూ.499 మాత్రమే.. ఉండటం నిజంగా బెస్ట్. బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ మంచి క్వాలిటీ మ్యూజిక్ గాడ్జెట్ కొనాలనుకునే విద్యార్థులకు , కాలేజీ యూత్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ ధరలో నమ్మదగిన బ్రాండ్ నుంచి ఒక మంచి పోర్టబుల్ స్పీకర్ కోరుకునే.. వారికి ఈ మోడల్ బ్లూటూత్ స్పీకర్ అద్భుతమైన ఆప్షన్. ఎఫ్ఎం రేడియో, ఆక్స్ సపోర్ట్, స్టైలిష్ లుక్‌తో.. వస్తున్న ఈ మినీ స్పీకర్‌ను మీ సొంతం చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయండి.

Related News

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

Big Stories

Advertisement
×